Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్..ఆయన సాధించిన రికార్డులు, రివార్డులు ఇవే ?
Ravichandran Ashwin: బంతిని మెలికలు తిప్పి మర్చిపోలేని విజయాలను అందించడంలో అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. ఇకపైన అశ్విన్ విన్యాసాలు ఇంటర్నేషనల్ క్రికెట్ లో మనం చూడలేము. టీమిండియా వెటరన్ అండ్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్లస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. Ravichandran Ashwin

Ravichandran Ashwin Retirement Highlights
ఈ నిర్ణయాన్ని అనౌన్స్ చేసేముందు అశ్విన్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ లో ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆల్ రౌండర్ అశ్విన్ 15 ఏళ్ల కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. అశ్విన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను అద్భుతంగా రాణిస్తాడు. ఈ క్రమంలో అశ్విన్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఎన్నో ఓడిపోయిన మ్యాచ్లను అశ్విన్ గెలిపించాడు. డ్రాగా ముగించాడు. టెస్ట్ లతో పాటు వన్డే క్రికెట్ లోనూ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శనను చూపించాడు. Ravichandran Ashwin
Also Read: Tendulkar-Kambli: 70 వేలు రావాల్సిన పెన్షన్ 30 వేలే ఎందుకు వస్తున్నాయి.. సచిన్ కుట్ర చేశాడా ?
టీమ్ ఇండియా తరపున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టి20లో 72 వికెట్లు తీశాడు అశ్విన్. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 3,503 పరుగులు చేశాడు. 2010లో శ్రీలంకపై వన్డేలో అరంగేట్రం చేసిన అశ్విన్ 2011లో వెస్టిండీస్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు. ఇన్ని రోజులు టీమిండియాకు అశ్విన్ అందించిన సేవలకు కృతజ్ఞతగా బీసీసీఐ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది. ఓ మంచి ఆల్ రౌండర్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడని ఎక్స్ లో పోస్ట్ షేర్ చేసింది. Ravichandran Ashwin