Raviteja: హోమ్లీ బ్యూటీతో రవితేజ ఎఫైర్.. నిజమేనా.?
Raviteja: మాస్ మహారాజా గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరో రవితేజ..అయితే అలాంటి రవితేజ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే చాలా రోజులుగా ఆయన తన స్కిన్ కి సంబంధించి ఒక డిసీస్ తో బాధపడుతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉన్న రవితేజకు ఇప్పుడు ఉన్న రవితేజకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి.

Raviteja Relation with Homely Beauty
అయితే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మొహంలో చేంజెస్ కనిపించడం కామన్. కానీ ఈయన కంటే పెద్ద ఏజ్ లో ఉన్న హీరోలు మాత్రం అలా కనిపించడం లేదు. ఈ విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఎలా అయినా రాణించాలంటే కచ్చితంగా కొన్ని రూమర్లలో ఇరకాల్సిందే అంటారు. ఎందుకంటే ఎన్ని రూమర్లలో ఇరికితే అంత పెద్దగా హైలైట్ అవుతూ ఉంటారు.అలా ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ అయిన ఎంతో మంది సెలబ్రెటీలు ఎన్నో రూమర్లలో హైలైట్ అయినవారే. (Raviteja)
Also Read: Nagarjuna: దానివల్ల చైతూ టార్చర్ అనుభవించాడు.. నాగార్జున మాటలకి కన్నీళ్లు పెట్టిన శోభిత.?
అలాంటి వారిలో రవితేజ కూడా ఒకరిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవితేజకు ఎంతోమంది హీరోయిన్లతో అఫైర్స్ వినిపించాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు.ముఖ్యంగా రవితేజ ఓ హోమ్లీ బ్యూటీని మాత్రం గాఢంగా ప్రేమించారని కొన్ని వార్తలు వినిపించాయి.. ఇక ఆ హోమ్లీ బ్యూటీ ఎవరంటే మీరాజాస్మిన్.. ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్ రీఎంట్రీలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుని మెస్మరైజ్ చేస్తుంది.

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రవితేజతో భద్ర సినిమా చేసే సమయంలో ప్రేమలో పడిందని ఎన్నో రూమర్లు వినిపించాయి. అంతేకాదు రవితేజతో ప్రేమలో పడ్డాక ఆమె ఏ సినిమాలు ఒప్పుకోవాలి అనేది కూడా రవితేజనే చూసుకునే వారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక రవితేజ కారణంగా ఓ సీనియర్ హీరో సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్ ఛాన్స్ కూడా కోల్పోయినట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై హీరో,హీరోయిన్ ఎవరూ స్పందించలేదు. దాంతో ఈ రూమర్ ఆగిపోయింది.(Raviteja)