Hot Water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ జబ్బు రావడం ఖాయం ?
Hot Water Bath: చలికాలంలో అందరూ వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. గీజర్లు వచ్చిన తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయడం చాలా సులభమైంది. అయితే ఈ గీజర్ వాడే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోయినట్లయితే ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. Hot Water Bath
Reasons Why Hot Water Bath Can be Bad for You
అప్పట్లో వేడి నీరు అంటే గ్యాస్ మీద లేదా కట్టెల పొయ్యి మీద పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు హీటర్, గీజర్ లను ప్రతి ఇంట్లో వాడుతున్నారు. గీజర్ నీటితో స్నానం చేసిన వెంటనే ఆఫ్ చేయాలి. లేకపోతే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ఇంకా కొందరు గీజర్ ను ఆన్ లో ఉండగానే స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కరెంటు షాక్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. గీజర్ లో వేడి నీళ్లు 35-45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే విధంగా చూసుకోవాలి. Hot Water Bath
Also Read: Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?
అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే జుట్టు రాలుతుంది. చర్మం కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా వేడి నీళ్లు చలికాలంలో చాలా ప్రమాదకరం. ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మంలో ఉండే సహజమైన నూనెలు కోల్పోతాము. అలాగే ఆరు నెలలకు ఒకసారి గీజర్ ను సర్వీస్ చేయించుకోవాలి. సర్వీస్ చేయించుకున్నట్లయితే గీజర్ వాడితే ఎలాంటి ప్రమాదాలు ఉండవు. లేనిచో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. Hot Water Bath