Hero: పేకాట అమ్మాయిలు.. రెబల్ స్టార్ కి ఉన్న ఈ అలవాటు నిరూపిస్తే వేల కోట్ల ఆస్తి.?

Hero: రెబల్ స్టార్ కి ఈ అలవాట్లు ఉన్నట్టు నిరూపిస్తే నిరూపించిన వారికి వేల కోట్ల ఆస్తి ఇస్తారట..మరి ఇంతకీ రెబల్ స్టార్ హీరోకి ఉన్న ఈ అలవాట్లు ఏంటి.. దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రెబల్ స్టార్ అనగానే అందరూ ప్రభాస్ అని అనుకుంటారు.కానీ ప్రభాస్ కాదు రెబల్ స్టార్ బిరుదు మొదట కృష్ణంరాజుది.కృష్ణంరాజు తర్వాత ప్రభాస్ కి రెబల్ స్టార్ అనే పేరు బిరుదు వచ్చింది.
Rebal Hero intresting comments
అయితే ప్రభాస్ అచ్చం పెదనాన్న లాగే అన్ని విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు.అయితే అలాంటి కృష్ణంరాజు ప్రస్తుతం చనిపోయినప్పటికీ ఆయన గతంలో పాల్గొన్న ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలా కృష్ణంరాజు మాట్లాడే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఏముంది అంటే చాలామంది నటీనటులకు తాగడం, అమ్మాయిలతో తిరగడం, పేకాట ఆడడం వంటి అలవాట్లు ఉంటాయి అని అంటూ ఉంటారు. (Hero)
Also Read: Heroine: ఆ హీరోయిన్ దయ్యం.. సినిమా అందుకే హిట్.. నిర్మాత సంచలన కామెంట్స్.?
కానీ నాకు ఉన్న ఏకైక చెడ్డ అలవాటు తాగడం మాత్రమే.నేను డ్రింక్ చేస్తాను. అది ప్రతిరోజు చేస్తాను. కానీ నాకు అమ్మాయిలతో తిరగడం పేకాట ఆడడం ధూమపానం తాగడం వంటి చెడు అలవాట్లు లేవు. అలాగే తాగడం అలవాటు ఉంది కానీ పీకల దాకా తాగి షూటింగ్ సెట్లకి వచ్చి ఇతరులను తిట్టే అలవాట్లు మాత్రం నాకు లేదు. ఒకవేళ నాకు ఈ దురాలవాట్లు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తా.. నాకు అలాంటి అలవాట్లు లేవు అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

అలాగే తమకి ఆస్తులు చాలానే ఉన్నాయని,కానీ మా పూర్వీకులు ఎన్నో కోట్ల ఆస్తులు కోల్పోయారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కృష్ణంరాజు ఫ్యామిలీ రాజుల వంశానికి చెందినవారు కాబట్టి ఇంట్లో డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉంటాయి అనుకుంటారు. కానీ వాళ్ళ ఇంట్లో అసలు డబ్బులు ఉండకపోయేవట. ఎందుకంటే వచ్చిన డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టేవారట. అలా కృష్ణంరాజు ఇండస్ట్రీకి వచ్చాక బాగానే డబ్బులు సంపాదించినప్పటికీ ఆ తర్వాత గ్రానైట్ బిజినెస్ చేసి లాస్ అయ్యారట.(Hero)