Pitapuram: పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబుపై తిరుగుబాటు ?
Pitapuram: పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుబాటు మొదలైంది. నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో… జనసేనకు వ్యతిరేకంగా….. టిడిపి నేతలు నినాదాలు చేశారు. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడానికి … పిఠాపురం వర్మ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో… వర్మ కు నిరాశ.

Rebellion against Nagababu in Pithapuram constituency
అయితే వర్మ టికెట్ రాకపోయినా కూడా… జనసేన కోసం పనిచేశాడు. ఎమ్మెల్సీ టికెట్ అయినా వస్తుందని ఎంతో ఆశపడ్డాడు వర్మ. కానీ చివరికి ఎమ్మెల్సీ టికెట్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. తాజాగా జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు… ఎమ్మెల్సీ పదవి దక్కింది.
త్వరలోనే మంత్రి పదవి కూడా వస్తుందని అంటున్నారు. అయితే మంత్రి పదవి రాకముందే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానంలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలలో నాగబాబు దూసుకు వెళ్తున్నారు. ఎమ్మెల్సీ పదవి రాగానే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాగబాబు. అయితే దీనిపై వర్మ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Revanth Reddy: కమిటీ ఏర్పాటు హడావిడి నిర్ణయం.. రేవంత్ రెడ్డి ఆలోచనా తీరు ఇంత దారుణమా?