Game Changer: గేమ్ ఛేంజర్ లోని నటినటుల రెమ్యూనరేషన్.. చరణ్ కి అంత తక్కువా..?
Game Changer: 450 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది యావరేజ్ అంటే మరి కొంతమంది సూపర్ అంటున్నారు. కానీ బ్లాక్ బస్టర్ అనేలా సినిమా లేదని తెలుస్తోంది. ఓవైపు యాంటీ ఫ్యాన్స్ సినిమా పోయింది దరిద్రం లాగా తీశాడు అని అంటే మెగా ఫ్యాన్స్ ఏమో పర్లేదు అనేలా కామెంట్స్ చేస్తున్నారు.
Remuneration of the actors in Game Changer
ఏది ఏమైనప్పటికీ బెనిఫిట్ షో తర్వాత వచ్చిన రివ్యూలకు ఇప్పుడు సినిమా చూసి బయటికి వచ్చి జనాలు చెబుతున్న రివ్యూలకు చాలా తేడా ఉంది. బెనిఫిట్ షో చూసి బాగుంది అన్నారు.కానీ తర్వాత షోస్ చూసినవాళ్లు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కొంతమంది బాగుందనడంతో హిట్ టాక్ అయితే వస్తుంది బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే నమ్మకం చిత్ర యూనిట్ లో ఉంది.(Game Changer)
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ లో ఇది గమనించారా.. చిరంజీవి చంద్రబాబులను దించుతూ..?
అయితే 450 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎంత..హీరో హీరోయిన్ లు ఎంత తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. 450 కోట్లకు పైగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.. అయితే అల్లు అర్జున్, ప్రభాస్ లతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే అల్లు అర్జున్, ప్రభాస్ లు తమ సినిమాలకి ఏకంగా 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపించింది. ఇక డైరెక్టర్ శంకర్ 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా అంజలి రెండు కోట్లు,కియరా అద్వానీ 7 కోట్లు, ఎస్ జె సూర్య మూడు కోట్ల తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే నవీన్ చంద్ర, సముద్ర కని శ్రీకాంత్ వంటి వారు కోటికి తక్కువగానే తీసుకున్నట్టు తెలుస్తుంది.(Game Changer)