Revanth Reddy: మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే అధికారం
Revanth Reddy: ఈ సారే కాదు మరో ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో కనిపిస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను అసెంబ్లీలో కనిపిస్తే.. గులాబీ పార్టీ నేతలు.. జీర్ణించుకోవడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy comments in assembly
గులాబీ పార్టీ నేతలను జైల్లో వేసేందుకే తనను ముఖ్యమంత్రి చేశారని… ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. తాను తలుచుకుంటే అందరిని బొక్కలో వేస్తానని గుర్తు చేశారు. డ్రోన్ ఎగరవేస్తే తనను గతంలో గులాబీ పార్టీ సర్కార్ అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు మేము అలా వ్యవహరిస్తే గులాబీ పార్టీ నేతలు అందరూ అరెస్టు అవుతారని హెచ్చరించారు. ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఖతం చేసి… ఆ కుర్చీలో హరీష్ రావు అలాగే కేటీఆర్ కూర్చోవాలని చూస్తున్నారని బాంబు పేల్చారు. కాబట్టి ఈ సమయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.