Revanth Reddy: మరో 10 ఏళ్లు కాంగ్రెస్ దే.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ ?
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనం ప్రకటన చేశారు. సోమవారం రోజున సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక బోనస్ డబ్బులతో రైతుల కళ్ళల్లో ఆనందం చూశానని.. దాంతో నాకు హైదరాబాద్ బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉందని వెల్లడించారు రేవంత్ రెడ్డి. Revanth Reddy

Revanth Reddy Comments On Congress
సన్న వడ్లకు… క్వింటాల్ కు 500 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని మోడీ… దారుణంగా విఫలమయ్యాడని ఫైర్ అయ్యారు. ఇటు రైతులను మోసం చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడని చురకలాంటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.కానీ తాము మాత్రం… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామని గుర్తు చేశారు. Revanth Reddy
Also Read: Jasprit Bumrah: IPL మెగా వేలంలో బుమ్రాకు రూ. 520 కోట్లు ?
ఇక తెలంగాణ రైతు భరోసా నిధులను త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి… అక్కడ.. విధివిధానాలపై సమావేశాలు నిర్వహించి… రైతు భరోసానిధులను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ… ముందుకు వెళుతున్నట్లు వివరించారు. రెండు లక్షల రుణమాఫీని.. చెప్పిన గడువుల్లోగా.. చెల్లించినట్లు గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Revanth Reddy