Revanth Reddy: వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా ?
Revanth Reddy: ఇప్పటినుంచి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తే తొడకలు తీస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. యూట్యూబర్లను మరోసారి అవమానించిన రేవంత్ రెడ్డి… యూట్యూబ్ జర్నలిస్టులను క్రిమినల్స్ కింద చూస్తామని హెచ్చరించారు. వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు రాసే రాతలు చూస్తే రక్తం మరుగుతుందని ఫైర్ అయ్యారు.

Revanth Reddy comments on jounalists
ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఇప్పటినుంచి పిచ్చి రాతలు రాస్తే బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉంది నేను కావాలంటే నన్నువిమర్శించండి ఇంట్లో ఆడవాళ్లను లాగడం ఏంటి ? అంటూ నిలదీశారు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు హద్దు దాటితే దాని ఫలితాలు వేరే విధంగా అనుభవిస్తారన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.
Hari Rama Jogaiah: చంద్రబాబు, పవన్ పరువు తీసిన లేఖ ?
పదే పదే ప్రతిపక్షాలు నా మాటలను వక్రీకరిస్తున్నారని… స్టేచర్ విషయంలో నా వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానంటూ చురకలు అంటించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. 3 డిసెంబర్ 2023 కు ముందు ఆ పార్టీకి ఉన్న స్టేచర్ ను… ఎన్నికల ఫలితాల తరువాత ప్రజలు స్ట్రెచర్ మీదకు పంపారని చెప్పానని తెలిపారు. కెసీఆర్ సీఎం గాఉండగానే కేటీఆర్ సీఎం అవుతారని వాళ్ల శాసన సభ్యులే చెప్పారని చురకలు అంటించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.
Pawan Kalyan: ఈ 11 ఏళ్ల వేడుకలు వైసీపీ 11కి అంకితం ?
తండ్రి ఉండగానే ఔరంగజేబులా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారని ఆగ్రహించారు. మేం అలా కోరుకోవడంలేదు… కేసీఆర్ 100 ఏళ్లు బ్రతకాలని కోరుకుంటున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. 15 నెలల్లో కెసీఆర్ కేవలం రెండురోజులు మాత్రమే సభకు వచ్చారని ఆగ్రహించారు. వచ్చే ముప్పై ఏళ్ల వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాలని కోరుకుంటున్నానంటూ చురకలు అంటించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. చట్ట సభల్లో ప్రతిపక్ష నాయకుడు 15 నెలల్లో 57 లక్షల పై చిలుకు జీతం తీసుకుని రెండే రోజులు సభకు హాజరైయ్యారని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.