Cm Revanth Reddy: కేసీఆర్, KTR సూచనలు చేస్తే.. హైదరాబాదును డెవలప్ చేస్తా ?

revanth reddy comments on kcr ktr

Cm Revanth Reddy: కెసిఆర్ అలాగే కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారిద్దరు ఇచ్చిన సూచనల మేరకు హైదరాబాద్ డెవలప్ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్ మరియు కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం ఉన్నవారన్నారు. వారు ఇద్దరు కలిసి పాలసీ రూపొందించి మాకు ఇస్తే మేము అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Cm Revanth Reddy

revanth reddy comments on kcr ktr

15,000 ఎకరాల భూమిని రైతులు ఇస్తే.. ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవచ్చు అంటూ పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయొచ్చు అని వివరించారు. గుజరాత్‌కి మోదీ నిధులు తీసుకుపోతుంటే.. మీరు గుడ్లప్పగించి చూస్తున్నారా? అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహించారు రేవంత్ రెడ్డి. మూసీని అడ్డుకుంటామంటున్నారు.. ఎందుకు అడ్డుకుంటారో చెప్పండి? అని నిలదీశారు. Cm Revanth Reddy

Also Read: KKR: కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహానే ?

చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించడానికే హైడ్రా పని చేస్తోంది….అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూలగొట్టలేదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. శిల్పారామం, హైటెక్ సిటీ, ట్యాంక్‌బండ్‌లను గతంలో మేమే నిర్మించామన్నారు. ఇకపై హైదరాబాదులో కూడా మంచి కట్టడాలు కడతామన్నారు. Cm Revanth Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *