Revanth Reddy: కమిటీ ఏర్పాటు హడావిడి నిర్ణయం.. రేవంత్ రెడ్డి ఆలోచనా తీరు ఇంత దారుణమా?

Revanth Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై చేపట్టిన బుల్డోజర్ చర్యలతో సీఎం రెవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు కఠినంగా స్పందిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రాత్రికి రాత్రే హడావుడిగా మంత్రుల కమిటీని (Ministers Committee) ఏర్పాటు చేశారు. ఈ చర్య చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు.
Revanth Reddy Faces Strong Criticism
ఈ కమిటీలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారు యూనివర్సిటీ అధికారులతో పాటు JAC, Students Groups, and Civil Societyతో చర్చలు జరపనున్నారు. అయితే, ఇది ముందే చేయవలసిన చర్యని, ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత చేపడుతున్నందున దీన్ని ఆత్మరక్షణ చర్యగా ప్రజలు చూస్తున్నారు.
అటవీ భూభాగాన్ని రాత్రికి రాత్రే 50 బుల్డోజర్లతో ధ్వంసం చేసి, వన్యప్రాణులకు ప్రమాదం కలిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక, గతంలో జరిగిన లగచర్ల (Lagacharla) ఘటన నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Real Estate లాభాల కోసమే ఈ చర్యలన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
విద్యార్థుల నిరసనను తట్టుకోలేని ప్రభుత్వం, వారిపై లాఠీచార్జ్ చేసి దాడికి దిగిన ఘటనను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. Paid batch అనే పదాలను ఉపయోగించి విద్యార్థుల పరువు తీసే ప్రయత్నం చేయడం, అర్థవంతమైన పాలన లోపాన్ని సూచిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెవంత్ రెడ్డి ఆలోచనా విధానం మారదని, ఇది మరో ఉదాహరణగా భావిస్తున్నారు.