RGV: నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదు?

RGV: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు.. వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ గోపాల్ వర్మ స్పందించడం జరిగింది. నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదన్నారు ఆర్జీవీ. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం పై సెటైర్లు వేశారు రాంగోపాల్ వర్మ. RGV

RGV Comments on Police Cases and Chandrababu

నేను పెట్టినవారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు రాంగోపాల్ వర్మ.
సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదన్నారు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను అంటూ రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టాయ్వుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. RGV

Also Read: BJP Targets Congress: 6 అబద్ధాలు 66 మోసాలు..బీజేపీ ప్లాన్ కాంగ్రెస్ బలయినట్లేనా!!

గతంలో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి… రాంగోపాల్ వర్మ సినిమా తీయడమే కాకుండా పోస్టులు కూడా పెట్టాడట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మపై కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం రాంగోపాల్ వర్మ.. పోలీసులకు అందుబాటులోకి రాకుండా బయట దేశాలకు వెళ్ళినట్లు సమాచారం. RGV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *