KCR: భారతదేశ వ్యాప్తంగా… కొన్ని ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ లెక్కల ప్రకారం… దేశంలోనే ధనికమైన ప్రాంతీయ పార్టీగా గులాబీ పార్టీ నిలిచింది. ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షుడిగా ఉన్న… గులాబీ పార్టీ ఖాతాలో.. ప్రస్తుతం 1449 కోట్ల నిధులు ఉన్నాయట. KCR

Richest Party In India By BRS

గత ఏడాది కిందట అంటే ఎన్నికల కంటే ముందు 1519 కోట్లు ఉన్నాయట. కానీ ఎన్నికల ఖర్చులు అలాగే సభలు వాటి వల్ల వాళ్ళ ఆస్తులు 1449 కోట్లకు చేరుకున్నాయి. అయితే… వైసిపి పార్టీ ఆస్తుల విషయాలు కూడా వైరల్ గా మారాయి. ప్రస్తుతం వైసీపీ పార్టీ వద్ద 27 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయట. దాదాపు 5 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న వైసిపి ఖాతాలో 27 కోట్లు మాత్రమే ఉండడం చాలా దారుణం అని అంటున్నారు. KCR

Also Read: Adani: మహారాష్ట్రలో BJP కూటమి విక్టరీ.. అదానికి భారీ ఊరట ?

ఇక తెలుగుదేశం పార్టీ ఖాతాలో.. నగదు 272 కోట్లు ఉన్నాయట. అదే సమయంలో సమాజ్వాది పార్టీ ఖాతాలో 340 కోట్లు ఉన్నాయని సమాచారం. అటు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె పార్టీ ఖాతాలో 338 కోట్లు ఉన్నాయి. ఈ లెక్కన దేశంలోనే గులాబీ పార్టీ అతిపెద్ద ధనిక పార్టీగా మారింది. KCR