Balakrishna-NTR: బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెడుతుంది ఆ లేడీనేనా..?
Balakrishna-NTR: ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం వణికిపోయేది..ఆ విధంగా ఇండస్ట్రీలో తాను ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేశారు ఎన్టీఆర్.. అలాంటి ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఎంట్రీ ఇచ్చారు.. కానీ ఇందులో అత్యంత ఆదరణ పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకుంటున్నారు.. అలాంటి ఎన్టీఆర్ ఇంతటి స్థాయికి రావడానికి వాళ్ల ఫ్యామిలీ అని చాలామంది అనుకుంటారు.. కానీ అదేమీ కాదు..
Rift Between Balakrishna-NTR is that lady
ఆయనకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ తన సొంత ఫ్యామిలీకి దూరంగానే ఉన్నారు.. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఎంత కలుద్దాం అనుకున్న వారు ఎప్పుడు దూరం పెడుతూనే వచ్చారు.. ఏదో ఒక రకంగా అవమానించడం వంటివి చేస్తూ వచ్చారు..కానీ ఎన్టీఆర్ వాళ్లు అంత చేస్తున్న ఏనాడు నోరు విప్పి వాళ్లపై విమర్శ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ చివరికి పాన్ ఇండియా స్టార్ గా మారారు.. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. దీంతో ఆయనను బేస్ చేసుకుని ఆ ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ఇండస్ట్రీలో కాస్త ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.. (Balakrishna-NTR)
Also Read: Lavanya: 300 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు.. హీరో నిఖిల్ తో పాటు ఆ ఓనర్..?
ఇంతటి ఘనత సాధించిన ఎన్టీఆర్ కు ఈ మధ్యకాలంలో మరోసారి అవమానం జరిగిందట. దీనికి కారణం ఆ మహిళా అని తెలుస్తోంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో మరియు బసవతారకం హాస్పిటల్ ద్వారా చేసినటువంటి సేవలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలకృష్ణకు తన కుటుంబ సభ్యులతో పాటు ఇతర రిలేషన్స్, ఫ్రెండ్స్ అంతా కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు.
అంతేకాకుండా తన అన్నకు ఇంతటి అవార్డు రావడంతో భువనేశ్వరి ఫామ్ హౌస్ లో ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి దగ్గర కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు.. కానీ ఈ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ను పిలవలేదని తెలుస్తోంది.. దీనికి కారణం భువనేశ్వరియేనట. ఆవిడే ఎన్టీఆర్ ను పార్టీకి పిలవద్దని చెప్పినట్టు సమాచారం అందుతుంది.. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Balakrishna-NTR)