Rishab Shetty: ఆ హీరోయిన్ ని పొగుడుతూ రష్మిక పరువు తీసిన రిషబ్ శెట్టి.?

Rishab Shetty: కన్నడ నటుడు నిర్మాత డైరెక్టర్ అయినటువంటి రిషబ్ శెట్టికి రష్మిక మందన్నాకి మధ్య గత కొద్ది రోజులుగా ఒక వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా రిషబ్ శెట్టి డైరెక్షన్ వహించిన కిరిక్ పార్టీ ద్వారా రష్మిక ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చివరికి తన మొదటి సినిమా పేరుని కూడా చెప్పడానికి ఇష్టపడని స్టేజిలో రష్మిక ఉందని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
Rishab Shetty insulted Rashmika
అలాగే కాంతార సినిమా విడుదలైన సమయంలో కూడా నేను ఆ సినిమా చూడలేదని చెప్పడంతో కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రష్మికపై ట్రోల్స్ వచ్చాయి. అయితే తన మొదటి మూవీ గురించి స్పందించమని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా ఒక కోట్ సైగ చేసి తన ఫస్ట్ సినిమా గురించి వ్యంగ్యంగా మాట్లాడడంతో చాలామంది రష్మికపై ఫైర్ అయ్యారు. (Rishab Shetty)
Also Read: Meena: ఇన్నాళ్లకు మీనా మంచి నిర్ణయం.. ఆ హీరోతో రెండో పెళ్లిపై సంచలనం.?
అప్పటినుండే రిషబ్ శెట్టి రష్మిక మధ్య వివాదం స్టార్ట్ అయింది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి పాల్గొన్న సమయంలో మీకు ఈ హీరోయిన్ల అందరిలో ఎవరు ఇష్టం అని రష్మిక మందన్న, సాయి పల్లవి,కీర్తి సురేష్, సమంత ల పేర్లు చెప్పారు.అయితే వీరందరిలో తనకు సమంత అంటే ఇష్టం అని,సాయి పల్లవి యాక్టింగ్ బాగుంటుందని రిషబ్ శెట్టి చెప్పారు.

అలాగే మీరు చెప్పిన ఈ హీరోయిన్ల లిస్టులో ఈ తరహా హీరోయిన్ అంటే నాకు అసలు నచ్చదు అంటూ రిషబ్ శెట్టి రష్మిక గతంలోని ఇంటర్వ్యూలో కోట్ సైగలతో ఎలా అయితే చెప్పిందో రష్మిక మందన్నా పై పరోక్షంగా అలాంటి సైగలతోనే రిషబ్ శెట్టి కూడా చెప్పేసరికి రష్మిక గురించే రిషబ్ శెట్టి ఈ వ్యాఖ్యలు చేశారని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే సమంతకి ఆరోగ్యం బాలేనప్పుడు చాలా బాధపడ్డాను అని,ఆమె త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలంటూ రిషబ్ శెట్టి రష్మిక ని అవమానిస్తూ సమంతని పొగుడుతూ మాట్లాడారు.(Rishab Shetty)