Rishabh Pant: రిషబ్ పంత్ కు ఢిల్లీ కెప్టెన్సీ ?
Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడడానికి అందుబాటులో ఉన్నట్లుగా వెల్లడించాడు. ఢిల్లీ జట్టు గతంలో సంభావ్య ఆటగాళ్ల జాబితాలో చేర్చడం జరిగింది. అతనితో పాటు విరాట్ కోహ్లీ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. రిషబ్ పంత్ ఈ మ్యాచ్ కు తాను అందుబాటులో ఉన్నట్టుగా వెల్లడించాడు. అలాగే ఢిల్లీ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ను చేయనున్నారట.
Rishabh Pant appointed Delhi Captain for Ranji Trophy
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ఇంకా ఎలాంటి వార్తలు వెలబడలేదు. అతను ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. పంత్ 2015లో రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చారు. అతని వయసు 18 ఏళ్ల 18 రోజులు మాత్రమే. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన వెంటనే అద్భుతాలు సృష్టించాడు. 2016-17 సీజన్లో అతను జార్ఖండ్ పై కేవలం 48 బంతుల్లో సెంచరీ చేశాడు. దీనితోపాటు ఈ ఆటగాడు మహారాష్ట్రపై త్రిపుల్ సెంచరీ సాధించిన ఘనతను అందుకున్నాడు. అప్పటికి పంత్ వయసు 19 ఏళ్ల 12 రోజులు. రంజీ ట్రోఫీలో పంత్ రికార్డుకు సాటి లేదు.
Ashwin Pension: వినోద్ కాంబ్లీ కంటే.. ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న అశ్విన్?
ఈ ఆటగాడు 17 మ్యాచుల్లో 58.12 సగటుతో 1395 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 100 ఉంది. నివేదికల ప్రకారం చాలామంది దిగ్గజ భారతీయ క్రికెటర్లు బీసీసీఐ ఆదేశాల మేరకు మాత్రమే రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఇప్పుడు సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ తరపున ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో ఆడడానికి అందుబాటులో ఉన్నట్లుగా వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… జనవరి 14 మంగళవారం వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ చేశాడు. పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడడానికి గిల్ కూడా అంగీకరించారు.