Rishabh Pant: ఏకంగా 16 కేజీలు తగ్గిన రిషబ్ పంత్ ?
Rishabh Pant: రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ లవర్స్ కు రిషబ్ పంత్ చాలా ఇష్టం. ఇతని పేరు సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. అయితే పంత్ గతంలో చాలా బొద్దుగా, ఊబకాయం సమస్యతో బాధపడేవాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ సన్నగా తయారు అయ్యాడు. అయితే పంత్ ఇలా మారడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం నాలుగు నెలల్లోనే 16 కిలోల బరువు తగ్గారు. Rishabh Pant
Rishabh Pant Weight Loss Journey
దీని కోసం ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అయ్యాడు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా పంత్ కేలరీలు తక్కువ ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకున్నాడు. దీనివల్ల శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. జంక్ ఫుడ్స్ తినడం పంత్ పూర్తిగా మానేశాడు. ముఖ్యంగా బయటి ఆహారానికి చాలా దూరం అయ్యాడు. కేవలం ఇంటి ఆహారాన్ని మాత్రమే తిన్నారు. పంత్ బరువు తగ్గడంలో తన కుటుంబ సభ్యులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారట. Rishabh Pant
Also Read: Pakisthan: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో షాక్.. ఒంటరైన పాకిస్తాన్?
పంత్ బరువు తగ్గాలని ఇంట్లోనే ప్రత్యేకమైన శ్రద్ధతో మంచి ఆహారాన్ని అందించారు. స్వీట్స్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని చాలా కాలం పాటు స్వీట్స్ తినకుండా దూరంగా ఉన్నాడు. ఫ్రైడ్ ఆహార పదార్థాలు, బిరియాని వంటి ఆహారాలను కూడా అసలు తీసుకోలేదు. సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు. శరీరానికి సరైన నిద్ర ఉన్నట్లయితే బరువు నియంత్రణలో ఉంటుందనే విషయాన్ని పంత్ నిరూపించాడు. Rishabh Pant