Rithu Chowdhary: రీతూ చౌదరి ల్యాండ్ స్కాం..వందలకోట్లు మాయం!!

rithu-chowdhary-land scam in vijayawada

Rithu Chowdhary: గత కొన్ని రోజులుగా రీతూ చౌదరి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ముఖ్యంగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్‌లో ఆమె పేరు సంచలనం రేపింది. జబర్దస్త్ వంటి ప్రముఖ టీవీ షోలతో పాపులర్ అయిన రీతూ చౌదరి 700 కోట్ల రూపాయల భారీ స్కామ్‌లో ఇరుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే, పెళ్లి కాలేదని ఆమె చెప్పిన విషయం ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది, ముఖ్యంగా ఆమె కు చీమకుర్తి శ్రీకాంత్ భర్త ఎలా అయ్యాడనేది సందేహాలు కలిగించింది.

ఈ వివాదంపై రీతూ చౌదరి ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఆమె తన పెళ్లి విషయం నిజమేనని, కానీ నాలుగు నెలలపాటు మాత్రమే తనతో శ్రీకాంత్ కలిసి ఉన్నాడని, ఆ తర్వాత అతని ప్రవర్తన నచ్చక విడిపోయానని చెప్పారు. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ స్కామ్‌లో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరు మీద ఉన్న భూమి ఎక్కడుందో కూడా తనకు తెలియదని, శ్రీకాంత్ చెప్పినట్లు సంతకాలు చేశానని ఆమె వివరించారు. ఇది ఒక పెద్ద స్కామ్ అని ఊహించలేదని, శ్రీకాంత్‌ను నమ్మి మోసపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రీసెంట్‌గా ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తున్నందున, చాలా మంది ఆమెను నిర్దోషిగా భావిస్తున్నారు. నిజంగా ఆమె ఈ భారీ స్కామ్‌లో భాగమై ఉంటే, బుల్లితెరపై చిన్న షోలలో, ఈవెంట్లలో డబ్బు కోసం పని చేయాల్సిన అవసరం ఉండదని చాలామంది అంటున్నారు. ఆమె మాటలు చూస్తుంటే, ఈ ఘటనతో ఆమెకు సంబంధం లేదని స్పష్టమవుతోంది. అయితే, పోలీసులు ఈ విషయంలో ఎలా దర్యాప్తు చేస్తారో చూడాలి.

రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె పేరు మార్చుకుంది. మొదట యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తరువాత సీరియల్స్‌లో లేడీ విలన్‌గా గుర్తింపు పొందింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఈటీవీ షోలలో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. స్టార్ మా ఛానల్‌లో కూడా పలు ఈవెంట్లలో పాల్గొంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ అనే గేమ్ షోలలో కూడా ఆమె సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఆమె కంటెస్టెంట్‌గా వచ్చినట్లు అనుకున్నారు, కానీ చివరికి ఆమె బయటపడిపోయింది. రాబోయే సీజన్‌లో ఆమె పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *