Robinhood : నైట్ ఇద్దరం సినిమా చూసి ప్రేమించుకున్నాం.. కౌగిలించుకుని కామించుకోబోయాం: నితిన్


Robinhood Songs Become Instant Viral Hits

Robinhood : టాలీవుడ్ హీరో నితిన్ మరియు డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న విడుదల కానుంది. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి.

Robinhood Songs Become Instant Viral Hits

ప్రెస్ మీట్‌లో మాట్లాడిన నితిన్ మాట్లాడుతూ, “రాబిన్‌హుడ్ ఓ పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇందులోని కామెడీ పూర్తిగా క్లీన్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత ఆర్గానిక్ హాస్యం నేను చూడలేదు” అని తెలిపారు. దర్శకుడు వెంకీ కుడుముల రాసిన కథ, స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడుతూ, “క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రేక్షకులు ‘వావ్’ అనాల్సిందే!” అని నితిన్ అభిప్రాయపడ్డారు.

నితిన్ తన బర్త్ డే మార్చి 30 కాగా, “రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28న వస్తుండటంతో ఇది తనకు గొప్ప బర్త్ డే గిఫ్ట్ అవుతుందని” చెప్పారు. గతంలో శ్రీలీలతో కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, “రాబిన్‌హుడ్ ద్వారా ఈ జంట హిట్ కపుల్‌గా నిలవడం ఖాయమని” నితిన్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. “భీష్మ 2.0 కన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది” అని నితిన్ చెప్పారు. ఈసారి వెంకీ కుడుముల తన దర్శకత్వంలో ‘వెంకీ 3.0’ని చూపించబోతున్నారని, సినిమా హ్యాట్రిక్ హిట్ ఖాయమని నితిన్ ధీమాగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *