Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన రికార్డు.. వాళ్ళ రికార్డు బద్దలు ?
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన రికార్డు సృష్టించాడు. 30 సంవత్సరాల వయసులో కూడా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. 30 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ 36 సెంచరీలు బాధలు. ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ.

Rohit Sharma’s sensational record
ఇప్పటివరకు సచిన్ టెండుల్కర్… 35 సెంచరీలు చేయగా ఆ రికార్డును 36 సెంచరీలతో బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ 26 సెంచరీలు చేసి.. దుమ్ము లేపాడు. ఇటు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 19 సెంచరీలు మాత్రమే చేశాడు. ఇది ఇలా ఉండగా దాదాపు 16 నెలల తర్వాత వన్డేల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ.
76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక… రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకోవడంతో మిగతా ఆటగాళ్లు అందరూ… సరైన దారిలో బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలోనే రెండవ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.