Roja: రోజా కూతురు పెళ్లి ఫిక్స్.. ఆ బడా హీరో ఇంటికి కోడలుగా.?
Roja: రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ హీరోయిన్స్ అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. అలాంటి రోజా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కానీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడి స్టార్ గా ఎదిగింది. ఆమె ఎదుగుతున్న తరుణంలో ఎన్నో అవమానాలు పడ్డది. అయినా వాటిని దిగమింగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు నటనలో ఎదురు లేదు అనిపించుకుంది. కేవలం నటన రంగంలోనే కాకుండా వ్యాపార రాజకీయ రంగాల్లో కూడా స్టార్ గా మారింది.
Roja daughter marriage is fixed
తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా పొందింది. అలాంటి రోజా తన కూతురుకు పెళ్లి కూడా చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. రోజా తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే తమిళ దర్శకుడైన సెల్వమణిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరు ఇద్దరికీ కుమార్తె అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. వీరిద్దరూ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. (Roja)
Also Read: Kajal: గుడ్ న్యూస్.. మళ్లీ తల్లి కాబోతున్నకాజల్..?
ఇప్పటికే తన కుమార్తె అన్షు సోషల్ మీడియాలో తన ఫోటోలు పెడుతూ అందరిని అదరగొట్టేస్తుంది.తల్లిని మించిన అందంతో ఓ వెలుగు వెలుగుతోంది. అలాంటి రోజా కూతురు స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇదే తరుణంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజాను యాంకర్ మీ అమ్మాయిని ఓ స్టార్ హీరో ఇంటికి కూడలిగా పంపబోతున్నారా అని ప్రశ్నించగా రోజా షాక్ అయిపోయిందట.
అదంతా అబద్ధమని నా కుమార్తె ప్రస్తుతం చదువుకోడానికి మాత్రమే అమెరికా వెళ్లిందని, కానీ కొంతమంది ఆమె నటన, డాన్స్ నేర్చుకోవడానికి వారిని వెళ్లిందని వార్తలు రాస్తున్నారని అదంతా అబద్ధమని చెప్పేసింది.. ఆమె యాక్టర్ కావాలని కోరుకోవడం లేదని, తన కూతురు సైంటిస్ట్ కావాలని కలలు కంటుందని చెప్పింది. తన ఇష్ట ప్రకారమే సైంటిస్ట్ కు సంబంధించిన చదువు చదువుతోందని చెప్పింది. పెళ్లి విషయంలో ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలని కొట్టి పడేసింది.దీంతో రోజా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Roja)