Roja: రోజా పొగరు.. చెప్పినా వినకుండా ఆ హీరోయిన్ ని బండ బూతులు తిట్టి.?

Roja: రాజకీయాల్లో సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రోజా అంటే తెలియని వారు ఉండరు.ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించిన రోజా రాజకీయాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ అనే సంగతి మనకు తెలిసిందే.రోజా తన సినిమాలతో ఎంతోమంది కుర్రకారుని తన వలలో వేసుకుంది.అయితే అలాంటి రోజాకి దగ్గుబాటి వెంకటేష్ కి మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్దిరోజుల నుండి టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు.
Roja insult that heroine
అయితే వీరిద్దరి మధ్య విభేదాలు నిజమేనని తాజాగా రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. తోట ప్రసాద్ మాట్లాడుతూ.. వెంకటేష్ రోజా మధ్య విభేదాలు ఉన్నవి నిజమే.కానీ ఆ విభేదాలతో వెంకటేష్ కి ఎలాంటి సంబంధం లేదు. రోజా కాస్త తొందరపాటు నిర్ణయం తీసుకొని సౌందర్యని,వెంకటేష్ ని విమర్శించింది.అయితే ఈ విమర్శలు పేపర్లో వచ్చే ముందు వెంకటేష్ నీ కలిసి క్లారిటీ అడగగా రోజా తో జరిగిన గొడవ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. (Roja)
Also Read: Hero: పెళ్లి కాలేదని నమ్మించి టాలీవుడ్ హీరోయిన్ ని గర్భవతిని చేసిన హీరో.?
అయితే రోజా ఓ సినిమాలో తనని తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారనే ఉద్దేశంతో నాపై ఈ విమర్శలు చేసింది.కానీ హీరోయిన్ ఎంపిక చేసుకోవడం అనేది నా చేతుల్లో ఉండదు. అదంతా ప్రొడ్యూసర్ చూసుకుంటారు. మీరు ఈ రూమర్లు పేపర్లో వేసుకున్నా పర్వాలేదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ రోజా మాత్రం అసలు విషయం తెలియకుండా వెంకటేష్ సౌందర్యలని విమర్శించిందట. ఇక విషయం ఏమిటంటే.. రాజా మూవీని తెలుగులో తీద్దాం అనుకున్న సమయంలో హీరోయిన్గా రోజాని అనుకున్నారట.

కానీ ఆ తర్వాత వెంకీ రోజా కాంబోలో వచ్చిన పోకిరి రాజా మూవీ డిజాస్టర్ అయిందని ఈ హీరోయిన్ కలిసి రాలేదు అనే ఉద్దేశంతో నిర్మాతలు రోజాని పక్కనపెట్టి సౌందర్యని తీసుకున్నారు. ఇక సౌందర్యని తీసుకోవడంతో రోజా ఈ విమర్శలు చేసింది. కానీ ఈ విషయంపై వెంకటేష్ మాత్రం నేను ఏ హీరోయిన్ ని నిర్మాత తీసుకువస్తే ఆ హీరోయిన్ తోనే చేస్తాను. హీరోయిన్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు.కానీ రోజా మాత్రం ఎంతమంది చెప్పిన వినకుండా వెంకటేష్,సౌందర్య లను విమర్శించింది అంటూ రైటర్ తోట ప్రసాద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(Roja)