Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు ఉన్న కష్టాలే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అవే కష్టాలు వెంటాడుతున్నాయి. అయితే తెలంగాణలో కేసీఆర్ కంటే ఎక్కువగా ఏపీలో జగన్మోహన్ రెడ్డిని.. టిడిపి నేతలు వేధిస్తున్నారు. వైసిపి పార్టీ కార్యాలయాలకు నోటీసులు అంటించడం, ఇటు వైసీపీలో ఫైర్ బ్రాండ్లు గా ఉన్న నేతలపై కేసులు పెట్టడం జరుగుతుంది. Jagan
RS Praveen Kumar in the field for Jagan
ఇటు జగన్మోహన్ రెడ్డి పైన కూడా తాజాగా కేసు నమోదు అయ్యేలా.. భారీ స్కెచ్ వేసింది టిడిపి. వైసిపి ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణ రాజును… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసి… దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… రఘురామకృష్ణ రాజు కాళ్లు వాపులు ఎక్కడ… పోలీసులు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. Jagan
Also Read: Palnadu Ycp: మాచర్ల ఔట్… పౌరుషాల గడ్డ పల్నాడు పోటుగాడు ఎవరు?
అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు అదే కేసును తెరపైకి తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి పైన హత్య కేసును..పెట్టారు. దీంతో కొంతమంది ఐఏఎస్ అధికారులు అలాగే జగన్మోహన్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ సంఘటనపై తాజాగా… జగన్మోహన్ రెడ్డికి అండగా… గులాబీ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలిచారు. Jagan
అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఐఏఎస్ ఆఫీసర్ లపై.. కేసులు పెట్టడం దారుణమని… వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో… చర్యలు తీసుకున్న అధికారులపై ఇలా కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని తెలిపారు. ప్రజా ప్రతినిధులపై…కేసులు పెట్టడం… మానుకోవాలని కూడా కోరారు. దీంతో జగన్ కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కెసిఆర్ రంగంలోకి దించారని… ఏపీ ప్రజలు కొంతమంది అంటున్నారు. Jagan