Sabja Seeds: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ రకాల ఆహార పదార్థాలను తిని అనేక రకాల వ్యాధులను తెచ్చుకుంటున్నారు. ఇక మరికొందరేమో ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధతో చాలా రకాల హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది బరువు తగ్గడానికి, ఫిట్నెస్ గా ఉండడానికి చాలా రకాల వ్యాయామాలు, డైట్ వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక బరువు తగ్గడానికి చాలా రకాల ఆహారాలను తింటూ ఉంటారు. అందులో భాగంగానే బరువు తగ్గడానికి సబ్జా గింజలను ఉపయోగిస్తూ ఉంటారు. Sabja Seeds
Sabja Seeds Benefits
వివిధ రకాల సలాడ్లు, జ్యూస్ లు వంటి ఆహార పదార్థాలలో వీటిని కలుపుకొని తింటూ ఉంటారు. ఇందులో ఫైబర్, కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల శరీరంలో తయారయ్యే కొవ్వును నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. ఈ సబ్జా గింజలను రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకోవడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా శరీరాన్ని వేడి నుంచి రక్షించడానికి సబ్జా గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: Vespa Dragon 155cc Scooter: మార్కెట్ లోకి కొత్త వెస్పా బైక్…ధర ఎంతంటే ?
అంతేకాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ సబ్జా గింజలు గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొలగించడంతో పాటు రక్తప్రసరణ సజావుగా సాగడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ్వాసకోస వ్యాధులు, మలబద్ధకం, డిహైడ్రేషన్, అధిక బరువు లాంటి ఇంకా అనేక రకాల సమస్యలకు సబ్జా గింజలు ఔషధంగా పనిచేస్తాయి. ఇది ఆరోగ్యానికే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. సబ్జా గింజలను పొడిచేసి కొబ్బరి నూనెలో కలుపుకొని శరీరానికి రాసుకోవడం వల్ల సోరియాసిస్, అంటువ్యాధులు సులభంగా తొలగిపోతాయి.
అంతేకాకుండా ముఖంపై ఏర్పడే మొటిమలను సైతం సబ్జా గింజలు నయం చేయగలవు. సబ్జా గింజల పొడిని పెరుగులో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నట్లయితే శరీరం కాంతివంతంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ రోజుకు రెండు మూడుసార్లు అయినా సబ్జా గింజలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యంతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్య నివేదికలో వెళ్లడైంది.