Sai Dharam Tej Donates: చిన్నారి కోసం నెటిజన్లను సాయం కోరిన మెగా హీరో.. ఎమోషనల్ పోస్ట్!!

Sai Dharam Tej Donates: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హయాకి తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా, మరికొందరు కూడా సహాయం అందించాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన Instagram Storyలో ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు.
Sai Dharam Tej Donates for Child Treatment
హయా అనే చిన్నారి కాలేయ సమస్యతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె జూబ్లీ హిల్స్, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించారు. “ప్రతీ డొనేషన్ ఎంతో విలువైనది. హయా నిజమైన పోరాట యోధురాలు. మీరు అందరూ కూడా మీ వంతు సహాయం చేస్తే, ఆమె త్వరగా కోలుకుంటుంది” అంటూ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు.
సాయి తేజ్ ఈ గొప్ప పనితో నెట్టింట వైరల్ అవుతున్నారు. అభిమానులు, నెటిజన్లు ఆయన మంచి మనసును ప్రశంసిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం #SupportForHaya అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా మరింత మంది ఈ విషయాన్ని తెలుసుకోవాలని కృషి చేస్తున్నారు. సామాజిక సేవలో సాయి తేజ్ ఎప్పుడూ ముందుంటారనే విషయం మరోసారి రుజువైంది. తన అభిమానులు కూడా ఆమె కోసం సహాయం చేయాలని కోరడం, నిజమైన హీరోగానే నిలిచారు.