Thandel Movie: అక్కడ దూసుకెళ్తున్న ‘తండేల్’..చైతు ఇరగదీస్తున్నాడే!!
Thandel Movie: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన “తండేల్” సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం నిజజీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. గుండెలను తాకే ఎమోషనల్ కంటెంట్‌తో, ఆకట్టుకునే కథనంతో, ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది.
Sai Pallavi and Naga Chaitanya Thandel Movie
తాజాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. యూఎస్‌లో విడుదలైనప్పటి నుంచి హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను సులువుగా దాటేసి, ఇప్పుడు 6 లక్షల డాలర్ల వైపు దూసుకుపోతుంది. ఈ వేగం కొనసాగితే, వీకెండ్ వరకు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి పాట ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను మరింత ఎమోషనల్‌గా మలిచింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం, టెక్నికల్‌గా కూడా బలంగా నిలిచింది.
ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. కథ, సంగీతం, నటన పరంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్‌పై ఎంతవరకు ప్రభావం చూపుతుందో సమయం చెప్పాలి.