Sai Pallavi: వివాదంలో సాయి పల్లవి.. కాపీ చేశారంటూ సంచలన కామెంట్స్.?
Sai Pallavi: సాయి పల్లవి రీసెంట్ గా తండేల్ మూవీతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఓ పక్క హిట్ వచ్చిందని సంతోషంలో ఉంటే మరో పక్క ఓ వ్యక్తి తాజాగా సాయి పల్లవి నా డాన్స్ ని కాపీ చేసింది అంటూ సంచలన ఆరోపణ చేశాడు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు సాయిపల్లవి చేసిన కాపీ డ్యాన్స్ ఏంటి అది ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవిని చాలామంది డాన్స్ క్వీన్ అంటారు.

Sai Pallavi in controversy
డాన్స్ లో సాయి పల్లవి తో పోటీపడి చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే అలాంటి సాయి పల్లవి తన డాన్స్ తోనే ఎక్కువ మందిని ఫిదా చేసింది. అయితే హైలెస్సో హైలెస్సా అనే పాటలో వెనకవైపు తిరిగి చేతులు తిప్పుతూ నడుము తిప్పుతూ ఆమె చేసే డాన్స్ కి చాలామంది ఆకర్షితులయ్యారు. అయితే ఈ డ్యాన్స్ స్టెప్ నాది అని తాజాగా బుజ్జి అనే వ్యక్తి ఆరోపించారు.(Sai Pallavi)
Also Read: Devi Movie: “దేవి” మూవీలోని పాము అభం శుభం తెలియని బాలుడి ప్రాణం తీసిందా.. షాకింగ్ నిజం.?
సాయి పల్లవి చేసిన డ్యాన్స్ స్టెప్పులు నేను గత రెండు సంవత్సరాల క్రితమే నా ఇన్స్టా పేజీలో షేర్ చేశాను.. కావాలంటే ఆ డాన్స్ చూడండి ఇది కాపీ డ్యాన్స్ నా డ్యాన్స్ ని కాపీ కొట్టారు అంటూ హాయ్ రమేష్ బుజ్జి అనే ఇన్స్టా గ్రామ్ లో ఈ డ్యాన్స్ స్టెప్ రెండు సంవత్సరాల క్రితం పోస్ట్ చేశాను.అయితే ఏదో ఫేమస్ అవ్వడానికి చేస్తున్న వ్యాఖ్యలు కాదు.ఒకసారి మీరు నా ఇన్స్టా గ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది.

నేను 10 సంవత్సరాల ముందే ఈ స్టెప్పు చేసాను. రెండు సంవత్సరాల క్రితం ఈ స్టెప్ ని సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేసుకున్నాను. నా డాన్స్ స్టెప్ ని సాయి పల్లవి కాపీ చేసింది అంటూ ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇక తండేల్ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ కుమార్ సాయి పల్లవితో ఈ స్టెప్ వేయించారు.దీంతో తాజాగా సాయి పల్లవి వివాదంలో ఇరుక్కున్నట్టు అయింది.(Sai Pallavi)