Sai Pallavi: అవార్డు వస్తే నాకేంటి.. నాకు ఆ హీరో నచ్చలేదు.?
Sai Pallavi: ఇప్పటి జనరేషన్లో నేచురల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఎంత పెద్ద హీరో అయినా సరే తనకు ఆ సినిమాలో పాత్ర నచ్చితేనే నటిస్తుంది. ఆ సినిమాలో తన పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోతే సినిమా వైపు కూడా చూడదు.ఎంత పెద్ద హీరో అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అలా తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి హీరో సినిమాని కూడా సిల్లీ రీజన్ తో సాయి పల్లవి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ సాయి పల్లవి రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
Sai Pallavi Reject star hero movie
సాయి పల్లవి గత ఏడాది అమరన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాలో ఇందూ రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయి నటించింది. ఇక ఈ ఏడాది తండేల్ మూవీతో మన ముందుకు రాబోతోంది.తండేల్ సినిమాలో ఇప్పటికే బుజ్జి తల్లి పాట చాలా ఫేమస్ అయింది. ఈ విషయం పక్కన పెడితే.. సాయి పల్లవి యాక్టింగ్ బాగుండడంతో తమిళ నటుడు చియాన్ విక్రమ్ తన సినిమాలో ఆఫర్ ఇచ్చారట. చియాన్ విక్రమ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అరుణ్ కుమార్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.(Sai Pallavi)
Also Read: Saif Ali Khan: లక్షల మంది సాధువుల తలలు నరికి.. అందుకే సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి..?
అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి సాయి పల్లవి కరెక్ట్ గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆమెని సంప్రదించారట.కానీ సాయి పల్లవి కి మాత్రం విక్రమ్ సినిమాలో హీరోయిన్ రోల్ అస్సలు నచ్చలేదట. దాంతో స్టోరీ మొత్తం విన్న సాయి పల్లవి నేను ఈ సినిమాలో నటించను నాకు డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పి పంపించేసిందట. అయితే ప్రస్తుతం సాయి పల్లవి విక్రమ్ సినిమాని రిజెక్ట్ చేసిన సంగతి కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంత పెద్ద హీరో సినిమాని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే పాత్ర నచ్చకపోతే సాయి పల్లవి ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే రిజెక్ట్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.ఇక సాయి పల్లవి రోల్ నచ్చకపోవడం మాత్రమే కాదు రీమేక్ సినిమాల్లో కూడా నటించదు. రీమేక్ సినిమాల్లో చేస్తే అంతకుముందు నటించినా వారి పాత్రల్లో సరిగ్గా నటిస్తామా లేదా అనే భయంతోనే సాయి పల్లవి రీమేక్ సినిమాలో నటించదు.ఇక స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా చెల్లెలి పాత్రలో అవకాశం ఇస్తే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.(Sai Pallavi)