Sai Pallavi: తండేల్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్.. ఎంత తీసుకుందంటే..?
Sai Pallavi: సాయి పల్లవి.. తన యాక్టింగ్ తో ప్రతి ఒక్క సినిమాను హిట్ కొట్టించే ఈ బ్యూటీ నటించిన తాజా సినిమా తండేల్..ఈ మూవీ మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక గీత ఆర్ట్స్ నాగచైతన్య కాంబోలో ఇది మూడో సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే తండేల్ మూవీ కి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని విశాఖపట్నం లో గ్రాండ్ గా చేశారు.

Sai Pallavi took huge remuneration for Tandel
ఈ ఈవెంట్ కి సాయి పల్లవి హాజరు కాక పోయినప్పటికీ నాగచైతన్య తన యాస భాష మాటలతో అందరినీ అట్రాక్ట్ చేశారు. అలాగే నేను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ సినిమా వైజాగ్ లో భారీ ఎత్తున హిట్ కొట్టాలని చెప్పారు. ఈ విషయం పక్కన పెడితే.. సాయి పల్లవి తండేల్ మూవీ కోసం రికార్డ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.(Sai Pallavi)
Also Read: Tandel Tamil trailer: తమిళ్ ‘తండేల్’ ట్రైలర్ కోసం డిల్లీ భాయ్!!
అయితే సాయి పల్లవి నటించిన సినిమా హిట్ కాకపోతే కచ్చితంగా తన రెమ్యూనరేషన్ లో ఎంతో కొంత వెనక్కి ఇచ్చి నిర్మాతకు సాయం చేస్తుంది. అయితే అలాంటి సాయి పల్లవి తండేల్ మూవీ కోసం రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదట. ఈ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి ఓ టాక్ వినిపిస్తోంది.. ఇక ఐదు కోట్ల రెమ్యూనరేషన్ సాయిపల్లవి కెరియర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పుకోవచ్చు.

ఇప్పటివరకు సాయి పల్లవి నటించిన సినిమాలకు రెండు మూడు కోట్లు తప్ప ఐదు కోట్లు తీసుకోలేదు. ఇక తండేల్ మూవీ కోసం మాత్రం ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ తో మరోసారి హిట్ కన్ఫామ్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఈ సినిమా కి నాగచైతన్య సాయి పల్లవి ల కెమిస్ట్రీ ఏ మేరకు ప్లస్ అవుతుందో..(Sai Pallavi)