Sai Pallavi: ఆ సినిమాలకు దూరం..కఠిన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి!!

Sai Pallavi: సాయి పల్లవి తన నటన తో సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనదైన శైలి, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కమర్షియల్ సినిమాల కోసం తన ఇమేజ్‌ను మార్చుకోవడం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. “ఫిదా” నుంచి ఇప్పటి వరకు, ఆమె చేసిన ప్రతి సినిమా కథానాయికకు సముచిత స్థానం కల్పించే విధంగా ఉంటుంది.
Sai Pallavi Unique Film Choices
మధ్యలో “ఎంసిఏ” మాత్రమే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమాల బాట పట్టలేదు. గత ఏడాది “అమరన్” లో శివకార్తికేయన్‌కు ధీటుగా నటించి, తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. తాజా బ్లాక్‌బస్టర్ “తండేల్” లోనూ, నాగ చైతన్యను డామినేట్ చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ విజయానికి చైతూని మించిన కారణంగా సాయి పల్లవి పేరును వినిపిస్తున్నారు.
తన టాలెంట్‌తో దూసుకుపోతున్న సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్ “రామాయణ” ప్రాజెక్ట్‌లో సీత పాత్రలో మెరవనుంది. 2026, 2027 దీపావళికి రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా, ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. నటనలో వైవిధ్యం చూపించడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
ఇప్పుడు చేస్తున్న సినిమాలను బట్టి, మరో 2-3 ఏళ్ల వరకు ఆమెను రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడటం కష్టం అని చెప్పవచ్చు. ఇటీవల, దర్శకుడు సందీప్ వంగా “తండేల్” విజయోత్సవ వేడుకలో సాయి పల్లవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకోవడం దీనికి అద్దం పడుతోంది.