Sai Pallavi: నాగచైతన్య శోభిత మధ్య చిచ్చు పెట్టిన సాయి పల్లవి..?
Sai Pallavi: నాగచైతన్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఒక సక్సెస్ రెండు ఫ్లాప్స్ అనే విధంగా దూసుకుపోతున్నాడు.. అలాంటి నాగచైతన్య తాజాగా పాన్ ఇండియా చిత్రం తండేలు మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు జరుపుకుంటున్నటువంటి తండేలు మూవీపైనే నాగచైతన్యకు భారీ ఆశలు ఉన్నాయి..
Sai Pallavi who broke up between Naga Chaitanya Sobhita
ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన కెరియర్ పూర్తిగా మారిపోయినట్టే.. అందుకే ఈ చిత్రం కోసం ఆయన చాలా కష్టపడి నటించారట. అంతేకాదు చేపలు పట్టే జాలరి పాత్రలో ఈయన నటనతో అదరహో అనిపించారట. అలాంటి ఈ మూవీకి సంబంధించి తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ప్రోగ్రాంకి అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా వస్తారని చెప్పడంతో ఎంతో మంది అభిమానులు ఆయన కోసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. (Sai Pallavi)
Also Read: Fauji Film: ఫౌజీ లో బ్రాహ్మణ సైనికుడు గా ప్రభాస్.. ఆ ఎపిసోడే సినిమా కు హైలైట్!!
కానీ సమయానికి అల్లు అర్జున్ రావడం లేదని చెప్పడంతో అభిమానులంతా నిరాశపడ్డారు. ఇదే తరుణంలో ఈ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకున్నారు.. ఈ క్రమంలోనే యాంకర్ గా వచ్చినటువంటి సుమ బుజ్జి తల్లి అనే పేరును ఎవరికి డెడికేట్ చేస్తారని అడగగా నాగచైతన్య వెంటనే నా భార్య శోభితకు అని చెప్పాడు.. నిజంగానే ఆయన భార్యని ఇంటి దగ్గర బుజ్జి తల్లి అని పిలుస్తారట.. అదే పదాన్ని సినిమాలో కూడా ఉపయోగించారట..
అంతేకాదు ఈ చిత్రంలో బుజ్జి తల్లి అనే పాటకు సాయిపల్లవి డాన్స్ చేయడమే కాకుండా, చిత్రంలో సాయిపల్లవిని కూడా బుజ్జి తల్లి అని అంటారట.. బుజ్జి తల్లి అనే పేరును తన పర్మిషన్ లేకుండా సినిమాల్లో వాడుకోవడంతో శోభిత చాలా బాధపడిందట.. అంతేకాదు నాగచైతన్యతో ఆ పదాన్ని సినిమాలో వాడినందుకు నాగచైతన్యతో గొడవ కూడా పడిందట.. ఈ విధంగా బుజ్జి తల్లి అనే పేరు చైతు ఫ్యామిలీలో కలంకం సృష్టించిందని చెప్పవచ్చు..(Sai Pallavi)