Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దురదృష్టం.. 15 వేల కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాడా.?
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దురదృష్టం అంటే ఇదే. ఎందుకంటే ఆయనకున్న 15,000 కోట్ల ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఖాజానా లో పడినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ సైఫ్ కి 15,000 కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది..ఆ ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కి దాదాపు 1300 కోట్లు ఆస్తులు ఉన్నాయని ఇప్పటివరకు అందరికీ తెలుసు. కానీ ఈ 15 వేల కోట్ల ఆస్తి సంగతి ఏంటో తెలియదు.
Saif Ali Khan has lost 15 thousand crores of property
అయితే ఈ 15 వేల కోట్ల ఆస్తి సైఫ్ కి వారసత్వంగా వస్తున్న ఆస్తి.ఈ ఆస్తిని సైఫ్ అలీ ఖాన్ పూర్వికులు అయిన ముత్తమ్మమ్మ భారతదేశం విభజన జరిగిన సమయంలో ఈ దేశం వదిలి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు తన ఆస్తులను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అయితే దేశ విభజన తర్వాత ఎవరైనా సరే ఇక్కడ ఆస్తులు వదిలేసి వెళ్తే ఆ ఆస్తులు పూర్తిగా ఎనిమీ చట్టం ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయి అని ఒక చట్టం తీసుకువచ్చారు.(Saif Ali Khan)
Also Read: Monalisa: బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన మహా కుంభమేళ మోనాలిసా..?
అయితే ఎనిమీ చట్టం ప్రకారమే సైఫ్ అలీ ఖాన్ ముత్తమ్మమ్మ వదిలి వెళ్ళిన ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందాయి. కానీ ఆ ఆస్తిపై నాకు హక్కు ఉంది అది మా పూర్వీకుల ఆస్తి అని సైఫ్ అలీ ఖాన్ కోర్టు ఇచ్చిన తీర్పుకి క్వాష్ పిటిషన్ వేశాడు. దాంతో కోర్టు దీనిపై అప్పట్లో స్టే విధించింది. అయితే సైఫ్ కి ఇచ్చిన స్టే డిసెంబర్ 13 2024తో ముగియడంతో మళ్లీ ఈ 15 వేల కోట్లు ఆస్తి చర్చకు వచ్చింది.అయితే స్టే ముగిశాక మళ్ళీ 30 రోజుల పాటు దాని గురించి అప్పిల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఇన్ని రోజులైనా కూడా సైఫ్ అలీ ఖాన్ ఈ ఆస్తి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మళ్ళీ కోర్టుని ఆశ్రయించకపోవడంతో మొత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుంది అని భూపాల్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో సైఫ్ ని దురదృష్టం వెంటాడుతోంది. 15000 కోట్ల ఆస్తి కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.(Saif Ali Khan)