Salman Khan: నాకు బాలీవుడ్ హీరోలు కూడా సపోర్ట్ చేయరు – ట్రోలింగ్ పై సల్మాన్ రియాక్షన్!!

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘సికిందర్’ ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైంది. కానీ, రిలీజ్ అయినప్పటి నుంచీ సినిమాకు తీవ్ర ప్రతికూల స్పందన వస్తోంది. ప్రేక్షకులు కథనం స్పష్టంగా లేదని, కొన్ని scenes ఎందుకు ఉన్నాయో అర్థం కావడంలేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా థియేటర్స్‌లో ఫుట్‌ఫాల్ తగ్గిపోయి, బాక్సాఫీస్ వసూళ్లు నిరాశపరిచాయి.
Salman Khan on Bollywood support
ఈ సినిమాతో రష్మిక ‘గోల్డెన్ లెగ్’ మళ్లీ నిరూపించుకుంటుందన్న ఆశలు అభిమానుల్లో నెలకొన్నా, ఫలితాలు నిరాశ కలిగించాయి. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించినప్పటికీ, ‘సికిందర్’ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలో కనిపించినా, ఫలితంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటి రోజు నుంచే occupancy తక్కువగా ఉండడంతో ఈ మూవీ డిజాస్టర్ వైపు సాగుతోంది.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. “నా సినిమాపై బాలీవుడ్ సెలబ్రిటీస్ మౌనం పాటిస్తున్నారు. నాకు వాళ్ల మద్దతు అవసరం ఉంది. నేను ఎన్నిసార్లు వారిని సపోర్ట్ చేశాను.. కానీ ఇప్పుడు వాళ్లు ఎక్కడ?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
కేవలం ఫలితం మీదే కాదు, తన dedication పై వస్తున్న trolls పైనా సల్మాన్ స్పందిస్తూ, “నా dedication లేకుంటే, నేను ఈ స్థాయికి ఎలా వచ్చేవాడిని?” అంటూ ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ‘సికిందర్’ ఫెయిల్యూర్ వల్ల సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనవ్వడమే కాదు, బాలీవుడ్ మిత్రుల నుంచి మద్దతు లేనందుకు బాధపడుతున్నట్లు స్పష్టమవుతోంది.