Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు. అయితే ఈయన్ని ఇప్పటివరకు ఎలాంటి సమస్య కలిచివేసిందో ఏమో తెలియదు కానీ అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియడం లేదు.ఇక సల్మాన్ ఖాన్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ సల్మాన్ ఖాన్ కి తన తల్లి లాంటి భార్య కావాలి అని చూస్తున్నాడు. తనకి రాబోయే భార్య కూడా తన తల్లిలాగే ఓపిక సహనంతో ఉండాలి అనుకుంటాడు అని చెప్పారు.
Salman Khan who loved the star heroine deeply
అలాగే గతంలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్,సంగీత బిజ్లాని, షాహిన్ జఫ్ఫ్రీ, ఫరియా అలం,సోమీ అలీ, మహెక్ చాహల్ వంటి ఎంతోమంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించాడు.ఇక వీరందరిలో ఐశ్వర్యారాయ్ ని మాత్రం ఈయన చాలా ఘాడంగా ప్రేమించారు. ఐశ్వర్యారాయ్ కూడా సల్మాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.కానీ వీరి మధ్య ఏమైందో ఏమో కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. (Salman Khan )
Also Read: Dimple Hayathi: పెళ్లి పీటలెక్కబోతున్న రవితేజ బ్యూటి.. అబ్బాయి ఎవరంటే.?
అయితే సల్మాన్ ఖాన్ ఐశ్వర్య కత్రినా వంటి హీరోయిన్లు కాకుండా మరో హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జుహీ చావ్లా.. ఈ హీరోయిన్ ని చాలా కాలం ప్రేమించిన సల్మాన్ పెళ్లి చేసుకోవాలని భావించి జుహీ చావ్లా తండ్రిని నేరుగా వెళ్లి పెళ్లి చేసుకుంటానని అడిగారట. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ జుహీ చావ్లా ఫాదర్ సల్మాన్ తో పెళ్లికి ఒప్పుకోలేదట.
దాంతో సల్మాన్ చేసేదేమీ లేక వెనుతిరిగారట. జుహీ చావ్లా చాలా మంచి మనస్తత్వం కలదని, ఆమె క్యారెక్టర్ చాలా మంచిదని,ఆమెని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అంటూ ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(Salman Khan )