Sam Konstas: బుమ్రాకు పీడ కల మిగిల్చిన సామ్ కాన్స్టాస్ ?
Sam Konstas: భారత్ తో జరిగిన మెల్బోర్న్ టెస్ట్ కు ముందు సామ్ కాన్స్టాస్ సెన్సేషన్ గా మారుతున్నాడు. అతను మైదానంలోకి దిగిన వెంటనే తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో దానిని మరింత తీవ్రతరం చేశాడు. 19 సంవత్సరాల వయసు ఉన్న సామ్ బాక్సింగ్ డే టెస్ట్ లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసే అవకాశం పొందాడు. తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఇతను ఎందుకు అంత ప్రత్యేకమైనవాడో నిరూపించుకున్నాడు. Sam Konstas
Sam Konstas Torchared Bumrah
సామ్ అద్భుత అర్థసెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు శుభారంబాన్ని ఇచ్చాడు. తొలి సెషన్ లో అతని ఇన్నింగ్స్ కారణంగా భారత బౌలర్లలో నైతికత తక్కువగా కనిపించింది. సామ్ మొదటి నుంచి బుమ్రాను లక్ష్యంగా చేసుకోవాలని, తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అతనికి వ్యతిరేకంగా స్కూప్ షాట్లు కూడా ఆడాడు. బుమ్రా వేసిన వేర్వేరు ఓవర్లలో 14, 18 పరుగులు చేశాడు సామ్ కాన్స్టాస్. బుమ్రా ఒక స్పెల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు నెలకొల్పాడు. Sam Konstas
Also Read: Annamalai: రేవంత్ రెడ్డి పరువు తీసిన అన్నామలై ?
33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 2018 లో బుమ్రా స్పెల్ లో 40 బంతుల్లో 25 పరుగులు చేసిన ఇంగ్లాండ్ మాజీ లెజెండ్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు సామ్ కాన్స్టాస్. మెల్బోర్న్ లో భారత్ తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కెరీర్ ప్రారంభించిన సామ్ హాఫ్ సెంచరీ సాధించి ప్రత్యేక క్లబ్ లో చేరాడు. కేవలం 52 బంతుల్లోనే తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుల జాబితాలో నిలిచాడు. 19 సంవత్సరాల 85 రోజుల వయస్సులో దీనిని చేశాడు. నీల్ హార్వే 19 సంవత్సరాల 121 రోజుల రికార్డును బద్దలు కొట్టాడు. Sam Konstas