Samantha and Shobhita: సమంతను బీట్ చేస్తున్న శోభిత.. గ్లామర్ ఫొటోలతో అక్కినేని కోడలు రచ్చ!
Samantha and Shobhita: అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకుల తర్వాత శోభితా దూళిపాళ్ల తో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. వీరి విడాకుల తరువాత శోభితా పేరు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాగా ఫైనల్ అదే నిజమైంది. చైతన్య, శోభితా ప్రేమలో ఉన్నారని అనేక వార్తలు చక్కర్లు కొట్టగా వీరి వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది.
Samantha and Shobhita glamour debate ongoing
శోభితా అక్కినేని కోడలిగా మారిన తర్వాత, ఆమె గ్లామర్, అందం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలోనూ పలు గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇవన్నీ చైతన్యతో ఆమె పెళ్లి తర్వాత చేయడం మరింత మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇక, సమంత కూడా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో క్రేజ్ సొంతం చేసుకుంటోంది. అయితే, శోభితా కూడా తన గ్లామర్ తో సమంతను దాటడంతో, చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది శోభితా గ్లామర్ షో చేయడంలో తప్పు ఏమి లేదు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, అయితే కొందరు ఈ దృష్టిని విమర్శిస్తూ ఓ పెద్దింటి ఇంటి కోడలు ఈ విధంగా చేయడం తప్పు అంటున్నారు. ఇంకొంతమంది శోభిత గ్లామర్ ముందు సమంత గ్లామర్ పెద్దగా లేదనే వారు కూడా ఉన్నారు.