Samantha: హీరోలకు ఎక్కువ ఎందుకు.. మరో వివాదంలో ఇరుక్కున్న సమంత!!


Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు అందే పారితోషకాలు చాలా భారీగా ఉంటాయి. కానీ అదే సమయంలో హీరోయిన్లకు మాత్రం తక్కువ వేతనం ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్‌లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ నటి సమంత (Samantha) కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ధైర్యంగా బయటపెట్టారు.

Samantha on actor remuneration disparitt

ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) మాట్లాడుతూ, ప్రేక్షకుల దృష్టిని ఎవరూ ఎక్కువగా ఆకర్షిస్తే వారికి ఎక్కువ పారితోషకం ఇవ్వడం న్యాయమని చెప్పారు. అయితే ఈ వాదనను సమంత తిరస్కరించారు. ‘‘ఇద్దరూ సమానంగా కష్టపడుతున్నప్పుడు, వేతనంలో ఈ స్థాయి వ్యత్యాసం ఎందుకు?’’ అని ఆమె ప్రశ్నించారు. నటీనటుల కృషిని బట్టి రెమ్యూనరేషన్ (Remuneration) ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.

తన సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) ద్వారా రూపొందిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాలో అందరికీ సమాన పారితోషకం ఇచ్చే విధంగా ఉన్నామని దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) తెలియజేశారు. దీనిని సమంత కూడా ధృవీకరించారు. ఇదే మార్గంలో కొనసాగాలని, ఇది ఒక కొత్త ఆరంభంగా మారాలని ఆమె ఆకాంక్షించారు.

‘‘పురుషులకు, మహిళలకు సమానంగా ఇవ్వాలని నేను పోరాడటం లేదు. కేవలం ఎవరు ఎంత కష్టపడుతున్నారో దానికి తగిన పారితోషకం ఇవ్వాలి’’ అని సమంత తేల్చిచెప్పింది. నటీమణులుగా మేము అడగకుండా, మా పని తాలూకు విలువ గుర్తించి, సముచిత వేతనం ఇవ్వాలి అనే అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *