Samantha: పెళ్లైన హీరోకి ప్రపోజ్ చేసిన సమంత..?
Samantha: సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ టెన్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. అందచందాలు నటన అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సమంత తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయినా ఏ మాత్రం బాధపడని సమంత సినిమాలపై దృష్టి పెట్టి దూసుకుపోతున్న తరుణంలోనే మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు పడింది.
Samantha proposed to a married hero
చివరికి ఆ వ్యాధి నుంచి కూడా కోలుకొని ఇప్పుడిప్పుడే సినిమాల్లో చేస్తూ తన కెరీయర్ ను గాడిలో పెట్టుకుంటుంది. అలాంటి సమంత ఈ మధ్యకాలంలో సీటడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. రాజు మరియు డీకే డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా చేశాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ ఎంతో అలరిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అనే అవార్డుకు నామినేట్ అయింది..(Samantha)
Also Read: Manchu Mohan Babu: పిచ్చ కొట్టుడు కొట్టుకున్న మంచు మనోజ్ మోహన్ బాబు .. పోలీస్ స్టేషన్లో కేసు.?
ఈ సినిమాకు ఇంతటి ఘనత రావడానికి ప్రధాన కారకురాలు సమంతా అని చెప్పవచ్చు. అలా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ఆ విధంగానే తాజాగా ఆ పెళ్లయిన హీరోకు వీ లవ్ యు అని చెబుతూ ప్రపోజ్ చేసింది.. అయితే సోషల్ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.
నితిన్ ను కుర్చీలో కూర్చోబెట్టి అటు ఇటు ఊపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్యూట్ గా “వీ లవ్ యు” అంటూ ప్రపోజ్ చేసింది సమంత.. ఇది విన్న నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ, ఇక నీ కన్ను పవర్ స్టార్ పై పడిందా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే, పవర్ స్టార్ అంటే పవర్ అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఆమె పెట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Samantha)