Samantha: 2025లో పెళ్లి పిల్లలు.. సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా.?
Samantha: సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్..ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.అయితే ఈ హీరోయిన్ పెట్టిన పోస్టులు కొంతమందికి పరోక్షంగా పెట్టినట్టు కూడా అప్పుడప్పుడు అనిపిస్తాయి. రీసెంట్గా శోభిత చైతుపై ప్రేమని తెలియజేస్తూ పోస్టు పెడితే సమంత తన కుక్కని ప్రేమతో చూస్తూ తన కుక్క కంటే గొప్ప ప్రేమ ఎవరిది కాదు అని పెట్టింది.

Samantha shocking post Is it about second marriage
దీంతో ఈ పోస్టు శోభితకి నాగచైతన్యకి కౌంటర్ ఇస్తూ సామ్ పెట్టింది అని అందరూ అనుకున్నారు అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఆ పోస్టులో 2025లో పెళ్లి పిల్లలు అంటూ అర్థం వచ్చేలా పెట్టడంతో చాలామంది హ్యాపీ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..2025 తనకు సంబంధించిన రాశి ఫలం ఎలా ఉంటుందో చెబుతూ ఒక పోస్ట్ చేసింది.(Samantha)
Also Read: Niharika: రొమాన్స్ తో రెచ్చిపోయిన నిహారిక ఇంటికి వెళ్ళాక అన్నతో తన్నులు.?
ఇక ఆ పోస్టులో ఏముందంటే.. “మకర,వృషభ,కన్య రాశి వాళ్ళు 2025 సంవత్సరంలో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది.. ప్రేమ,నమ్మకంని అందించే భాగస్వామిని పొందగలుగుతారు.. ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి.. ఆర్థికంగా బలంగా మారి మరిన్ని అవకాశాలు పొందుతారు.. ఈ సంవత్సరం అంతా చాలా బిజీ బిజీగా గడుపుతారు.పిల్లల్ని కూడా పొందుతారు. శారీరకంగా మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు”..

అంటూ అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ కి ముందు 2025లో తన రాశికి సంబంధించి ఏమేం జరుగుతాయో అవన్నీ తన జీవితంలో జరగాలి అని కోరుకుంటున్నట్లు కూడా సమంత చెప్పుకొచ్చింది. దీంతో సమంత 2025లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అనుకుంటుంది కావచ్చు. ఇది ఆమె జీవితంలో నిజం అవ్వాలి అని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.(Samantha)