Samantha: చైతూని మళ్లీ గెలుకుతున్న సమంత.. ఇంత చెప్పినా బుద్ధి రాలేదా.?
Samantha: ఏంటి సమంత నాగచైతన్యను గిచ్చి మరీ గెలుకుతోందా.. ఎందుకు మానిపోయిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ తట్టి లేపుతుంది. సమంత మళ్లీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది.మరి ఇంతకీ సమంత తీసుకున్న ఆ చెత్త నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక తనకిష్టం వచ్చినట్టు సినిమాలు చేసుకుంటూ పోతుంది.ప్రస్తుతం సమంతకు అడ్డు చెప్పేవారు కూడా ఎవరూ లేరు. ఆమె తన ఉనికిని చాటుకోవాలని ఎంతగానో పోరాడుతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఉ అంటావా మవా ఉఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ చేసి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది.

Samantha Torcher to Naga Chaitanya
అయితే ఈ ఐటెం సాంగ్ చేశాక నాగచైతన్యని మాత్రం ఇండస్ట్రీలో చాలామంది చులకనగా చూసారు. ఒకప్పుడు స్టార్ హీరో భార్య కానీ విడాకులు అయ్యాక ఆ హీరో భార్య చేసిన పని ఇది అంటూ ఎంతో మంది ఎత్తి చూపారు. కానీ విడాకుల తర్వాత నాగచైతన్యకు ఆమె ఏం చేసినా అనవసరం లేదు.కానీ ఎక్కడో ఓ మూలన కాస్త బాధ అయితే ఉంటుంది .అయితే ఇప్పటికే శోభితని పెళ్లి చేసుకొని ఆ బాధని మర్చిపోయిన నాగచైతన్యను సమంత మళ్ళీ మళ్ళీ తన జ్ఞాపకాలతో తట్టి లేపుతోంది. అయితే మరోసారి నాగచైతన్య మనసు నొప్పించడానికి సమంత అలాంటి నిర్ణయం తీసుకుందట.(Samantha)
Also Read: Akkineni Family:ప్రధాని మోదీని కలిసిన నాగార్జున, చైతన్య.. భేటీ వెనుక సీక్రెట్ ఏమిటి?
అదేంటంటే సుకుమార్ బన్నీ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ 1 లో బన్నీతో ఐటెం సాంగ్ లో ఆడి పాడింది.అయితే ఇప్పుడు మళ్లీ అదే బన్నీతో కలిసి త్రివిక్రమ్ సినిమాలో మరో ఐటెం సాంగ్ చేయబోతుందట సమంత. అయితే ఇప్పటికే సమంత బన్నీల మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగా బన్నీ ఈ విషయం చెప్పడంతోనే సమంత ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.దాంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటున్న నాగచైతన్యని ఇలా ఐటెం సాంగ్స్ చేస్తూ ఆయన పరువు మొత్తం తీస్తుంది అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మరి కొంత మందేమో నువ్వు విడాకులు తీసుకున్నాక నీ సినిమాలు విడుదలైన ప్రతిసారి సింపతి డ్రామాలాడావు. కానీ నాగచైతన్య మాత్రం సింపతి డ్రామాలు ఆడకుండా జరిగింది జరిగినట్టుగా చెప్పాడు. అలాగే మళ్ళీ ఎవరూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకూడదు అని,అది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని మాట్లాడారు. ఆయనేమో నీ గురించి పాజిటివ్గా మాట్లాడితే నువ్వు మాత్రం ఆయన్ని ఎప్పుడు ఇబ్బంది పెడదామా అనే చూస్తున్నావ్..ఇంత చెప్పినా నీకు బుద్ధి రాలేదు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)