Samantha upcoming projects: రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు.. స్టన్నింగ్ మేకోవర్ ఫ్యాన్స్ షాక్!!

Samantha upcoming projects: స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ప్రత్యేకమైన హెయిర్ స్టైల్, డిఫరెంట్ మేకోవర్ చూసిన ఫ్యాన్స్, ఇది సిటాడెల్ వెబ్ సిరీస్ కోసమా? లేక కొత్త మూవీ లుక్మా? అని ఆసక్తిగా చర్చిస్తున్నారు. కాఈ ఫోటోలు ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తీసుకున్నవన్నట్లు తెలుస్తుంది. అయినా, సమంత స్టైల్, గ్లామర్లో ఏమాత్రం తగ్గడం లేదు.
Samantha upcoming projects and career news

ఆమె హెల్త్ ఛాలెంజెస్ను ఎదుర్కొంటూనే సిటాడెల్ షూట్ పూర్తిచేశారు, అలాగే ప్రమోషన్లలోనూ యాక్టివ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం “రక్త బ్రహ్మండ్”లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక, ఫ్యామిలీ మాన్ నెక్స్ట్ సీజన్లోనూ ఆమె కనిపించనున్నారనే వార్త అభిమానులను ఆనందింపజేస్తోంది.

ఇంతలో సమంత ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె పనిచేస్తున్న దర్శక ద్వయంలో ఒకరితో సంబంధం ఉందనే గాసిప్స్ ఊపందుకున్నాయి. మరోవైపు, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే తన రెమ్యునరేషన్ తక్కువగా ఉండేదని ఆమె వెల్లడించారు. అందుకే, తన ప్రొడక్షన్ హౌస్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు సమానంగా రెమ్యునరేషన్ ఇస్తున్నానని చెబుతున్నారు.

“ఇండస్ట్రీలో అమ్మాయిలకు మరింత భద్రత అవసరం” అని పేర్కొన్న సమంత, “అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు? వారి వెనుక ఎవరు ఉన్నారు?” అనే విషయాలు చాలా ప్రభావితం చేస్తాయి అని అభిప్రాయపడ్డారు. తన కెరీర్లో మార్గనిర్దేశనం చేసే ఎవరైనా ఉంటే బాగుండేది, కానీ నేనే నేర్చుకున్నా” అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
