Samantha: ఫ్యాన్స్ ని పిచ్చోళ్లను చేసిన సమంత.. అదంతా డ్రామా అంటూ.?
Samantha: ఏంటి అదంతా ఉత్తుత్తేనా..సమంత అభిమానులను పిచ్చోళ్లని చేసిందా.. అదంతా పెద్ద నాటకమా.. ఇంతకీ సమంత చేసిన డ్రామా ఏంటి..ఫ్యాన్స్ ని ఎలా వెర్రోళ్లను చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. మయాసైటిస్ వచ్చినప్పటి నుండి సమంత ఏ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కూడా ఆ సినిమా ప్రమోషన్స్లో కచ్చితంగా తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కన్నీళ్లు పెట్టుకునేది. ఇక ఈ కన్నీళ్ళకు కరిగిన ఎంతో మంది ఫ్యాన్స్ ఆమె సినిమాని చూసి హిట్ చేసేవారు.
Samantha who made the fans crazy
అలా ఇప్పటికే ఖుషి,శాకుంతలం వంటి సినిమాలకి ముందు జరిపే ప్రమోషన్స్ ఈవెంట్లో సమంత కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా శాకుంతలం సినిమా ఈవెంట్లో సమంత పెట్టుకున్న కన్నీళ్ల వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా ఈ కన్నీళ్లు పెట్టుకునే విషయం గురించి ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది సమంత.ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మయాసైటిస్ వచ్చినప్పటినుండి కళ్లలోకి లైట్ ఫోకస్ పడితే వెంటనే నీళ్లు వచ్చేస్తున్నాయి.(Samantha)
Also Read: Akhil: అఖిల్ పై మోజు.. పెళ్లి అవ్వకుంటే బాగుండు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
లైట్ సెన్సిటివ్ వల్ల నా ప్రమేయం లేకుండానే నా కళ్లలో నుండి నీళ్లు వచ్చేస్తాయి. ఇక ఇది చూసి చాలామంది నా అభిమానులు నేను చాలా వీక్ అని..దేనికైనా సరే తొందరగా రియాక్ట్ అయి కన్నీళ్లు పెట్టుకుంటానని ప్రతి దానికి ఏడ్చేస్తానని అనుకుంటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.లైట్ నా కళ్లలో పడడం వల్లే నా కళ్ళనుండి నీళ్లు వస్తున్నాయి. కానీ మీరు ఊహించినట్లు ఏమీ లేదు నేను ఏడవట్లేదు అంటూ సమంత పెద్ద షాక్ ఇచ్చింది.
దాంతో సమంత మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఇన్ని రోజులు నువ్వు నిజంగానే ఏడుస్తున్నావు కావచ్చని సింపతి తోని నీ సినిమాను చూసాము. జాలి చూపించాము. కానీ నువ్వేమో లైట్ ఫోకస్ వల్ల కన్నీళ్లు వస్తున్నాయి అని చెబుతున్నావు. సినిమా రిలీజ్ ఈవెంట్స్ లో నువ్వు పెట్టుకున్న కన్నీళ్ళని దొంగ కన్నీళ్లు అని చెప్పి అభిమానులను అంత పిచ్చోళ్లని చేస్తావా..మేమేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నామా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Samantha)