Samantha: ఇంట్లో టార్చర్.. భర్త అనే అహంకారం.. నాగచైతన్య నిజస్వరూపం బయటపెట్టిన సమంత.?
Samantha: తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగార్జున హీరోగా ఎదిగి ఆయన వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇందులో అఖిల్ ఇంకా హీరోగా పేరు కోసం ట్రై చేస్తూ ఉంటే నాగచైతన్య మాత్రం పడుతూ లేస్తూ ఓ మోస్తారుగా పేరు మాత్రం సంపాదించారు. ఇలాంటి నాగచైతన్య ఇండస్ట్రీలో అంతగా పేరు లేని సమయంలోనే స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంతను వివాహం చేసుకున్నారు.
Samantha who revealed the real nature of Naga Chaitanya
వీరి వివాహ బంధం హ్యాపీగా కొనసాగుతున్న సమయంలోనే వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకుల పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక సమంత మాత్రం విడిపోయిన తర్వాత మయోసైటీస్ బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకొని ఆరోగ్యాన్ని సెట్ చేసుకుంది. నాగచైతన్య తన కెరియర్ పై దృష్టి పెట్టి సినిమాల్లో దూసుకుపోతూనే ఈ మధ్యకాలంలో శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నారు.(Samantha)
Also Read: Famous Telugu actresses: రకుల్ నుంచి శోభిత వరకూ.. ఈ ఏడాది తెలుగు తారల పెళ్లిళ్లు!!
ఇదంతా ఇలా కొనసాగుతున్న సమయంలో సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను నాగచైతన్య ఏ విధంగా టార్చర్ పెట్టాడో బయటపెట్టింది.. నేను నాగచైతన్యను పెళ్లి చేసుకున్న కొత్తలో ఆయన నన్ను ప్రతిరోజు ఇలా అనేవాడు. నువ్వు బయట ఎంత పెద్ద స్టార్ హీరోయినైనా సరే ఇంట్లో సరుకులు ఉన్నాయా లేదా తప్పనిసరిగా నువ్వే చూసుకోవాలి. ఇంట్లోకి వచ్చావు అంటే మామూలు గృహిణి గానే ఉండాలి. అంతేకాదు వీకెండ్ లో ఎక్కడికి వెళ్దాం అనే ప్లాన్ కూడా నువ్వే చేయాలి అంటూ ఆయన నవ్వుకుంటూ సమంతతో అనేవాడట.
ఈ విధంగా ప్రతిరోజు ఆమెపై ఆధిపత్యం చెలాయించే వాడని సమంత మాటలతో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన ఇలా నవ్వుకుంటూ అన్నాడని సమంత కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నవ్వుకుంటూ నే చెప్పింది. కానీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అప్పటికి నాగచైతన్య స్టార్ డం సంపాదించలేదు కాబట్టి, భార్యని డామినేట్ చేయడానికి ఈ విధంగా చేసేవాడని ,ఇదే వీరి విడాకులకు అసలు కారణమైందని తెలుస్తోంది. ఈ విషయాలను సమంత బయట పెట్టడంలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ ఆధిపత్యం కోసమే నాగచైతన్య సమంతను టార్చర్ చేశారని అంటున్నారు.(Samantha)