Samsung Galaxy F54: ఇండియన్ మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 4జి ఫోన్లు వస్తే ఇప్పుడు ఎక్కువగా 5జి ఫోన్లు వస్తున్నాయి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే మార్కెట్లోకి రావడంతో ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. వివిధ రకాల కంపెనీదారులు కూడా విక్రయాలు పెంచుకోవడానికి స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. Samsung Galaxy F54
Samsung Galaxy F54 5G Launched in India
ఈ క్రమంలోనే తాజాగా సాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలోనే మరొక కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. సాంసంగ్ గాలక్సీ ఎఫ్ 54 పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది సాంసంగ్ సంస్థ. ఇక సాంసంగ్ గాలక్సీ ఎఫ్ 54 ఫోన్లో 6.7 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ప్లేను అమర్చారు. ఈ ఫోన్ 380 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇక సాంసంగ్ గాలక్సీ ఎఫ్ 54 ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుందని సాంసంగ్ సంస్థ చెబుతోంది. Samsung Galaxy F54
Also Read: Realme C63: Realme నుంచి 9 వేలకే క్రేజీ ఫోన్..ఫీచర్లు ఇవే!
ఇక సాంసంగ్ గాలక్సీ ఎఫ్ 54 ఫోనులో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి ఎనిమిది గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇందులో ఎక్కువగా కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో కెమెరా క్లారిటీ విషయానికి వస్తే 108 మెగా పిక్సెల్స్ తో కూడిన రేయిర్ కెమెరాను అందించారు. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీలు కోసం 32 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఏర్పరిచారు. Samsung Galaxy F54
5 జి స్మార్ట్ ఫోన్లో మంచి టచ్ అనుభూతి కోసం సూపర్ స్మూత్ అనుభూతితో పాటు శక్తివంతమైన టచ్ ను తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఫోన్ కెమెరాతో 4కే రిజల్యూషన్ వీడియోను షూట్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే రూ. 24000గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్ ను ఆఫర్లో భాగంగా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా సాంసంగ్ గాలక్సీ ఎఫ్ 54 ఫోన్ ను ఈఎంఐ సదుపాయంలో కూడా కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy F54