Sandeep Raj : హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న నేషనల్ అవార్డు దర్శకుడు!!
Sandeep Raj: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఉన్న సందీప్ రాజ్ హీరోయిన్ చాందినీ రావు ను వివాహం చేసుకున్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ‘కలర్ ఫోటో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన నటి చాందినీ రావు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కు తెలుగు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
Sandeep Raj and Chandini Rao Wedding
సందీప్, చాందినీల ప్రేమకథ ‘కలర్ ఫోటో’ చిత్రీకరణ సమయంలో ప్రారంభమైంది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేడుకకు హీరో సుహాస్ తన కుటుంబంతో కలిసి హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, నటుడు వైవా హర్ష, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానుల నుంచి ప్రేమాభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సందీప్ రాజ్ తన మొదటి చిత్రం ‘కలర్ ఫోటో’తోనే జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు సాధించి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో కథనంలోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను కదిలించాయి. ప్రస్తుతం ఆయన ‘మొగ్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హీరోగా రోషన్ కనకాల నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ద్వారా సందీప్ తన దర్శకత్వ నైపుణ్యాన్ని మరింత సృజనాత్మకంగా ప్రదర్శించనున్నట్లు సమాచారం.