Sankranti Ki Vastunnam: అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రోమోషన్లు.. వెంకీ ని బాగానే వాడారు!!
Sankranti Ki Vastunnam: సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకమైన పండగ. ఈ సీజన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, సినిమాకు సంబంధించి చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పండగ సీజన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sankranti Ki Vastunnam Movie Promotions
వెంకటేష్ ఇమేజ్ను ఉపయోగించడంలో అనిల్ రావిపూడి తన క్రియేటివిటీ ని మరోసారి చాటుకున్నారు. గత చిత్రాల్లోని క్లాసిక్ సన్నివేశాలు, పాటలు, వెంకటేష్ హాస్యనటనను ఇప్పటి ప్రేక్షకులకు దగ్గరగా తీసుకురావడం ఆయన మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్లాసిక్ సాంగ్స్‌ను కొత్త హంగులతో రీడిజైన్ చేసి, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఈ వ్యూహం కొత్త తరం ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
సినిమా ప్రమోషన్లో క్రియేటివిటీ చూపించడంలో అనిల్ రావిపూడి ముందంజలో ఉన్నారు. సోషల్ మీడియాలో రీల్స్, స్పెషల్ వీడియోలు రూపొందించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటనతో కూడిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌లో పండగ వాతావరణాన్ని సృష్టించడంలో అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ పోటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలా కనబడుతోంది. ‘డాకు మహారాజ్’, ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలతో పాటు ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని అనుకుంటోంది. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పక అలరిస్తుందనే నమ్మకం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మార్కెటింగ్ వ్యూహాలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. అనిల్ రావిపూడి తెలివైన ప్రమోషన్ ప్లాన్స్, వెంకటేష్ ఇమేజ్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన కథా గుణంతో ఈ సినిమా పండగ సీజన్లో గ్రాండ్ హిట్‌గా నిలుస్తుందని స్పష్టంగా అనిపిస్తోంది.