BRS: బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి.. అసలు నిజాలు ఇవే..వీడియో వైరల్ ?
BRS: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకుల దాడి దృశ్యాలు వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి చేసిన వారు సీఎం రేవంత్ రెడ్డితో గతంలో ఫోటోలు దిగారని సమాచారం. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఓ వ్యక్తి పేరు మంగ ప్రవీణ్ అని.. యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అని తెలుస్తోంది.
Scenes of Congress leaders attacking BRS party office went viral
ఇక ఈ సంఘటనపై హరీష్ రావు కూడా స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ నిప్పులు చెరిగారు హరీష్ రావు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని… యదా రాజ తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అంటూ నిలదీశారు హరీష్ రావు.