Anil Ravipudi: భార్య చేతిలో అనిల్ రావిపూడి రహస్య వీడియోలు.?
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ డైరెక్టర్ పేరే వినిపిస్తుంది.. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి 350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసిన సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా ఈయన చాలా పాపులర్ అయిపోయారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి తీసిన సినిమాల్లో చాలావరకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉంటుంది.

Secret videos of Anil Ravipudi in wife hand
అలాగే ఎమోషన్స్ కూడా చూపిస్తారు. అలా తనదైన దర్శకత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కి సంబంధించి తాజాగా ఒక షాకింగ్ వార్త బయటపడింది. అదేంటంటే.. అనిల్ రావిపూడి కి సంబంధించిన కొన్ని వీడియోలు తన భార్యకి కొంత మంది బంధువులు లీక్ చేశారట. అయితే ఈ విషయం గురించి అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..(Anil Ravipudi)
Also Read: Priyamani: ప్రెగ్నెన్సీపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్.. అందుకే పిల్లల్ని కనడం లేదా.?
యూట్యూబ్లో కొంతమంది నా గురించి అందమైన వాయిస్ ఓవర్ లు ఇచ్చి పిచ్చిపిచ్చి వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అయితే యూట్యూబ్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నా ఒక్కడి మీదే కాదు ఎంతో మంది సెలబ్రిటీలపై ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారు. కేవలం లైక్స్,వ్యూస్ కోసం ఇలాంటి వార్తలు చిత్రీకరించి ఫ్యామిలీ లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా గురించి కూడా ఇలాంటి తప్పుడు వీడియోలు క్రియేట్ చేయడంతో నా బంధువులు నా భార్యకు ఆ వీడియోలు పంపించారు.

నా సతీమణి నాకు ఫోన్ చేసి ఇదేంటి నీ గురించి ఇలా రాశారు ఇలాంటి వీడియోలు క్రియేట్ చేశారని నన్ను అడుగుతుంది.అయితే ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేశాను. అలాగే ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసేవారిని యూట్యూబ్లో బ్లాక్ చేసేస్తారు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అనిల్ రావిపూడి.(Anil Ravipudi)