Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో ఎదురుదెబ్బ
Gorantla Madhav: వైసిపి పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను దారుణంగా కొట్టబోయి అడ్డంగా బుక్కయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. టిడిపి కార్యకర్త కిరణ్ ను అరెస్టు చేసి పోలీసులు తరలిస్తూ ఉండగా… వాళ్లను అడ్డుకొని మరి దాడి చేశాడు గోరంట్ల మాధవ్.

Sensational court verdict, remanding Gorantla Madhav for 14 days
ఇక… ఈ తరుణంలోనే గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా కోర్టు ముందు కూడా గోరంట్ల మాధవ్ ను హాజరు పరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు. దీంతో ఈనెల 24వ తేదీ వరకు గోరంట్ల మాధవ్ రిమాండ్ లో ఉండబోతున్నారు.
Telangana: తెలంగాణ ను అప్పుల కుంపటిలో పెట్టబోతున్న కాంగ్రెస్.. రాబోయే మూడు నెలల్లో వేలకోట్ల ఋణం!!
అయితే కిరణ్ పై దాడి చేసిన కేసులో గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురు వైసిపి నేతలపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆ అయిదుగురికి కూడా రిమాండ్ విధించింది కోర్టు. దింతో మొత్తం ఆరుగురు ఈ కేసులో 14 రోజులపాటు రిమాండ్ లో ఉండనున్నారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి పై టిడిపి కార్యకర్త కిరణ్ రెచ్చిపోయి మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌ను దారుణంగా కొట్టిన పోలీసులు ?