Mega family: మెగాస్టార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మంచి పేరు గల వ్యక్తి. అలాగే షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన సినిమా పరిశ్రమతో పోల్చుకుంటే బాలీవుడ్ నుంచే ఎక్కువగా స్టార్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. ఒకవేళ చెయకపోయినా అలాంటి వాళ్లంతా చిన్న ఏజ్ లోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఒకరు. ఈ అమ్మడు సినిమా కెరీర్ ను పూర్తిగా ప్రారంభించకుండానే ఓ రేంజ్ లో హైలెట్ అవుతుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుహానా ఖాన్ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆ సంగతున్నాయి మీరే చూసేయండి!. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ డాక్టర్ గా టీనేజ్ లో ఉన్నప్పుడే సుహానా ఖాన్ యమా ఫేయస్ అయింది. అలాగే, తరచూ తండ్రితో కలిసి ఈవెంట్లకు హాజరవుతూ..క్రికెట్ మ్యాచ్ లో సందడి చేస్తూ..పార్టీలు, పబ్ లలో హడావిడి చేస్తూ. గ్లామర్ షో ఇస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. దీనితో చిన్న వయసులోనే సుహానా సంచలనంగా మారిపోయింది. హీరోయిన్గా సుహానా ఖాన్ ఎంట్రీ ఇస్తుందని చాలా ఏళ్లు టాక్ నడిచింది. కానీ, అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. దీనితో ఆమె సినిమాల్లోకి రాదని అంతా అనుకున్నారు.
అయితే, గత ఏడాది సుహాన ‘the archies ‘ అనే సినిమాలో తరంగ్రేటం చేసింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ మనవడు ఆగస్త్య నందా హీరోగా, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి నటించారు. ఉన్నంత చదువులు చదువుతున్న సమయంలోనే సుహానా ఖాన్ డైటింగ్ ల గురించి చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందా తో ప్రేమాయణం సాగుస్తున్నట్లు ఈ మధ్యన బీ టౌన్ లో టాక్ వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ‘the archies ‘ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, ఆగస్త్య నందా చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీళ్ళిద్దరూ దీనిపై ఎప్పుడు స్పందించలేదు.